గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు మరో షాక్‌

  • ఆమ్‌ ఆద్మీ సిఎం అభ్యర్థి గధ్వీ ఓటమి
  • జామ్‌ ‌నగర్‌ ‌నుంచి క్రికెటర్‌ ‌జడేజా భార్య రివాబా విజయం

గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. ఆప్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ ‌గధ్వీ పరాజయం పాలయ్యారు. సౌరాష్ట్రలోని ఖంబాలియా నుంచి పోటీచేసిన గధ్వీ భారతీయ జనతా పార్టీ  అభ్యర్థి ములూ భాయ్‌ ‌బేరా చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడించారు. 1900 ఓట్ల పైచిలుకు తేడాతో ఆప్‌ ‌సీఎం అభ్యర్థి ఓడిపోయారు.వాస్తవానికి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని, అధికారంలోకి వస్తామని కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు బలంగా చెప్పారు. ఢిల్లీ మోడల్‌ ‌చూసి ప్రజలు ఓటేస్తారని అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌తదితరులు ప్రచారం చేశారు. పంజాబ్‌ ‌తరహా విజయం సాధిస్తామని మాన్‌ ‌తదితరులు చెప్పారు.

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌వచ్చాక కూడా మాన్‌ ‌మాట్లాడుతూ గుజరాత్‌లో ఆప్‌ అద్భుతాలు చేయబోతుందన్నారు. తీరా చూస్తే ఫలితాల్లో ఆప్‌ ‌చతికిలపడింది. పై పెచ్చు స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఓడిపోవడం కేజీవ్రాల్‌ ‌జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీ చేసిన చాలా చోట్ల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ విరాట్‌ ‌స్వరూపం చూపిస్తుందని కేజీవ్రాల్‌ ‌సహాఆప్‌ ‌నేతలెవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఫలితాలుచూసి షాకవుతున్నారు. ఇకపోతే జామ్‌ ‌నగర్‌ ‌నుంచి పోటీ చేసిన క్రికెటర్‌ ‌రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు.

గుజరాత్‌ ‌ను మోడల్‌ ‌గా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేన్నారు ఆమె.ఇది కేవలం తన విజయం మాత్రమే కాదన్న రివాబా…ప్రజా విజయం అన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.దీంతో ఆమె జామ్‌ ‌నగర్‌ ‌లో భారీ రోడ్‌ ‌షో నిర్వహించారు.తన భర్త జడేజాతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక గుజరాత్‌ ‌ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్‌ ‌భగేల్‌ ‌ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ్నఆ యాగ్నిక్‌ ‌పై 81వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు.పటిదార్‌ ఉద్యమకారుడు హార్థిక్‌ ‌పటేల్‌ ‌కూడా మెజారిటీ విజయం సాధించారు. గుజరాత్‌ ఆప్‌ ‌సీఎం క్యాడిడేట్‌.. ఇసుదాస్‌ ‌గఢ్వీ ఘోర ఓటమిని చవిచూశాడు.ఖంబాలియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి ములుభాయ్‌ ‌బేరా చేతిలో పరాజయాన్ని చవి చూశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page