గొప్ప మానవతావాది జహీర్ అలీఖాన్..!

తెలంగాణ విద్యావంతుల వేదిక
జహీర్ అలీఖాన్ సార్ మరణాన్ని తెలంగాణ లోని ప్రతి మానవ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఆకాల మరణం చెందిన సీయాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ సంస్మరణ సభను మదినా ఎడ్యుకేషన్ సెంటర్ లో నిర్వహించారు.ఈ సందర్భంలో వారి కుమారులు,కుటుంభ సభ్యులతో కలిసి జహీర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ సందర్భంగా అంబటి నాగయ్య అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ పాసీస్టు శక్తులను ఎండగట్టడంలో జహీర్  పాత్ర ఆదర్శనీయమన్నారు.మతతత్వ శక్తులను నిలదీయడంలో వెనుకడుగు వేయలేదన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ ఉధ్యమాలలోను,విప్లవోద్యమ శక్తులతోను ఇలా గొప్ప హృదయాన్ని ఏర్పరచుకున్నారు అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి ని,ఇంగ్లీష్ లోను ఉర్దూలోను ప్రదానంగా ముస్లిం సమాజానికి దగ్గర చేశారు అన్నారు.
గంగాయమునా తెహజీభ్ కు ప్రతిరూపం జహీర్:
వీక్షణం వేణుగోపాల్
తెలంగాణ కోసం డిల్లీలో చేసిన ప్రోగ్రాం లో వెయ్యమంది జర్నలిస్టులతో మా అందరి తో కలిసి నడిచారన్నారు.
పాలమూరు జిల్లా లో కరువు కాటాకాల పై ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రజాస్వామిక పోరాటాలలో పాల్గోన్నారన్నారు.
గంగ యమునా తెహజీభ్ కు ప్రతిరూపం జహీర్ అలీఖాన్ అని వీక్షణం వేణుగోపాల్ అన్నారు. సంఘ్ పరివార్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా కాలికి బల్పం కట్టుకొని తిరిగినాడు అన్నారు.సామాజిక జీవనంలో,పాలనలోను మతం తీసుకురాకూడదని బలంగా ఆకాంక్షించినవారు అన్నారు.లౌకిక వాదిగా,గొప్ప మానవతావాది గా ముస్లీం మైనార్టీ సమాజంలో ఇలాంటి వారి పాత్ర అరుదైనది అన్నారు.
జహీర్ జీవిత పోరాటం వైవిధ్యభరితమైనది:
ప్రొ:కోదండరాం
జహీర్ బాయ్ వైవిధ్యబరితమైన కార్యక్రమాలను నిర్వహించారని ప్రొ:కోదండరాం అన్నారు.వీటన్నింటి సారాంశం ఒక్కటే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ అన్ని కార్యక్రమాలు చేశారు అన్నారు. పేదలకు హార్దిక సహాయం అందించటంలో విశాల హృదయాన్ని చాటారు అన్నారు.పేద ముస్లింలకు చదువుకోవటానికి సహాయం చేశారు అన్నారు.మత ఘర్షణల బాధితులకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నం చేశారు అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మత ఘర్షణలు నివారణకు తన వంతు కృషి చేశారన్నారు.ప్రజాస్వామ్య విలువల ప్రతిష్టాపన కోసం ఇవాళ మనం జహీర్ చూపిన బాటలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
విలువలకు ప్రతిరూపం జహీర్:
దేవులపల్లి అమర్
సీనియర్ జర్నలిస్ట్
వర్కింగ్ జర్నలిస్టుల పోరాటంలో సియాసత్ నుండి జహీర్ నుండి అద్భుతమైన సహకారం అందేది అన్నారు.జర్నలిజం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడన్నారు.విలువలను పెంపొందించడంలో ప్రతిక్షణం పాటుపడ్డారన్నారు.సమాజానికి సంబంధించి గొప్ప లౌకికవాది అని,అన్న మతాల మిత్రులను ఆదరించే వారని వారన్నారు.చివరి చూపుకు నోచుకోలేకపోవడం నా జీవితంలో వెళితేనని వారన్నారు.

 

 

 

విజన్ ఉన్న వ్యక్తి జహీర్:
శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్
ఒక విజినరి ఉన్న వ్యక్తి జహీర్ అలీఖాన్
అన్నారు. వారు అన్ని సెక్షన్ లతో అసోసియేట్ అయ్యారు అన్నారు.జహీర్ అన్ని విషయాల పై స్పందించేవారన్నారు.ఒక్క కమ్యూనిటికి పరిమితం కాలేదన్నారు.ఆయన లేకపోవడం ప్రజాస్వామిక ఉధ్యమాలకు,లౌకికవాదానికి చాలా లోటు అన్నారు.

 

 

కష్ఠ కాలంలో వారు లేక పోవడం తీరని లోటు;
జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక
జహీర్ అలీఖాన్ నేను ఇద్దరం కూడా సామాజిక స్నేహితులం.సియాసత్ అనే ఉర్థూ పత్రిక వ్యవస్థలో అనేకమంది ని భాగస్వాములు చేశారన్నారు.వేలాదిమందికి ఉచితం వైద్యం అందించిన ఘనత వారిది అన్నారు.డెమోక్రటిక్ మూమెంట్ బిల్డప్ చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు అన్నారు. హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో అన్ని రకాల సామాజిక ప్రజాస్వామిక శక్తులతో కలిసి పనిచేశారన్నారు.ఈ సమాజంతో విశాల హృదయాన్ని పంచుకున్న జహీర్ ఆశయాలను ముందుకు తీసుకుపోదాం అన్నారు. ఈ కష్టకాలంలో విడిచిపోవడం ఈ సమాజానికి తీరని లోటు అన్నారు.

 

ప్రగతిశీల శక్తులు బలపడాలని ఆకాంక్షించాడు:
పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్
దేశం లోను,రాష్ట్రంలో ను లో ప్రగతి శీల శక్తులను,పునర్జీవనింప చేయాలని హిందూ ముస్లీం ల ఐక్యత కోసం సోదరాభావంతో ముందుకు సాగారన్నారు.బరువెక్కిన గుండెతో  జహీర్ గురించి మాట్లాడుతున్నాను అన్నారు.స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం జహీర్ ఆలోచనలో,ఆచరణలో స్పష్టం గా కనబడుతుందన్నారు.

 

 

జహీర్ కమిట్ మెంట్ గొప్పది: ప్రొ:రమా మేల్కేటో
తెలంగాణ సమాజం క్రిటికల్ పొజిషన్ లో ఉన్న సమయంలో జహీర్ మనలను విడిచి వెళ్లడం విషాదకరం అన్నారు. గుజరాత్ లోను ఓల్డ్ సిటీ లోను జరిగిన అనేక సంఘటనలపై జహీర్ స్పందించిన తీరు తెలంగాణ సమాజానికి ఆదర్శమన్నారు. తెలంగాణ మూమెంట్ లో ఆయన కమిట్ మెంట్ గొప్పది అన్నారు. మానవతా విలువలను పెంపొందించడంలో వారి స్టేటజి విలువైనదన్నారు.

 

 

 

సామాజిక మేధావి జహీర్: విరాహత్ అలీ, సీనియర్ జర్నలిస్టు

తెలంగాణ సమాజానికి దశాదిశా నిర్దేశించడంలో వారు కీలకపాత్ర పోషించారన్నారు.సామాజిక మేధావిగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిజంలో విలువలను పెంచి పోషించడంలో అనేకమంది జర్నలిస్టులకు మార్గదర్శకమన్నారు.

అన్ని శక్తులకు దగ్గరయ్యారు:
కె.సజయ, సామాజిక కార్యకర్త
జహీర్ అనేక అంశాల మీద పనిచేశాడని వారన్నారు. ఒక కమ్యూనిటీ కి మాత్రమే పరిమితం కాకుండా అనేకమంది వ్యక్తులకు శక్తులకు దగ్గరయ్యారు అన్నారు.
ఈ సంస్మరణ సభ కార్యక్రమంలో జహీర్ ఆలీఖాన్ కుమారులు అస్గరుద్దిన్ అలీ ఖాన్ ,ప్రకృద్దిన్  అలీ ఖాన్ ప్రొ:సూరేపల్లి సుజాత,అరుణోదయ విమలక్క,విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి
డిఎస్ ఎస్ ఆర్ క్రిష్ణ,సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి,అజీజ్ పాషా,మలుపు బాల్ రెడ్డి,
మంధాల బాస్కర్,పందుల సైదులు,సలీం పాషా, ముస్లీం కవి స్కైబాబా,పి.ఓ.డబ్లు సంధ్య,వెంకట్ రెడ్డి,హరికృష్ణ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page