వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: గ్రామపంచాయతీ కార్మికుల ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి లేదా అసెంబ్లీ ముట్టడిస్తాం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ మహిపాల్ రామకృష్ణ చంద్రయ్య లో మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా 29 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు సమ్మె డిమాండ్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు 19500 ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం జీవో నెంబర్ 51 రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించి అందరికీ ఈఎస్ఐ పీఎఫ్ ప్రమాద బీమా కల్పించాలని పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ఈఅసెంబ్లీ చివరి సమావేశాలలో మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు మాట్లాడి న డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం లేనిచో చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు .ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కుమార్ పాండు ఎల్లయ్య శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు.