వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా హెల్త్ సబ్ సెంటర్ లను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని విహారబాత్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండలం మురంగపల్లి మేకవనం పల్లి గ్రామాల్లో హెల్త్ సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. చంద్రయన్ పల్లి గ్రామంలో 113 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మోమిన్ పేట్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ దేశంలో ఇక్కడ లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ప్రజాభిమానం పొందిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికలు మరోసారి గణ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్ట లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త నమ్మకంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ మేక వనంపల్లి పిఎసిఎస్ చైర్మన్ అంజిరెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మేకవనం పల్లి సర్పంచ్ శశిధర్ రెడ్డి చంద్రయన్ పల్లి సర్పంచ్ అంజయ్య టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బైండ్ల బిచ్చయ్య మైపాల్ తదితరులు పాల్గొన్నారు.