హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, జూన్ 12(ఆర్‌ఎన్‌ఎ) : టీఎస్‌పీఎస్‌సి నిర్వహించే గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పక్రియ నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్-3, గ్రూప్-4లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను తొలగించారని పిటిషన్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 13కు వాయిదా వేసింది కోర్టు. గ్రూప్ 3, 4లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని హైకోర్టులో 101 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరువార్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఉద్యోగ నియామక పక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది.