- చంద్రబాబు, కరువు కవల పిల్లల లాంటి వారు
- వైఎస్సార్ భరోసా రెండో విడుత నిధులు
- ఆళ్లగడ్డలో విడుదల చేసిన సిఎం జగన్
నంద్యాల, అక్టోబర్ 17 : రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని సిఎం జగన్ అన్నారు. ఈ సారి కూడా సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదైంది అన్నారు. దేవుడి దయ వల్ల కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, కరువు రెండూ కవల పిల్లల లాంటి వారని జగన్ అభిప్రాయపడ్డారు. మన ప్రభుత్వం రైతులకు ఎలా మేలు చేయాలి అని ఆలోచిస్తుంటే.. చంద్రబాబు ఇతర విపక్షాలు మాత్రం.. దాచుకో.. దోచుకో.. తినుకో అనే విధానంలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడ్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని.. చంద్రబాబు దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో అందరూ గమనించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమాన్ని విడిచి పెట్టేది లేదన్నారు. బిడ్డగా తాను రైతులకు ఇవ్వని హాలు కూడా అమలు చేస్తున్నానని అన్నారు. అందరి ఆశీస్సులు ఉంటే.. మరిన్ని మంచి పనులు చేస్తాను అన్నారు. అలాగే కల్తీ విత్తనాలు అరికట్టేందుకు 147 ల్యాబ్ లను ప్రవేశ పెట్టామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుం టుందని.. అందకే రైతు సంక్షేమం కోసం.. అహర్శిశలు శ్రమిస్తానని హా ఇచ్చారు సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. బటన్ నొక్కి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096.04 కోట్ల నగదును బదిలీ చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. చంద్రబాబు హయంలో 2014లో 238 మండలాలు, 2015లో 359 కరవు మండలాలు, 2016లో 301 కరవు మండలాలు, 2017లో 121 కరవు మండలాలు, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో 257 కరవు మండలాలు ఉన్నాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. దేవుడి దయతో గత మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. రైతన్నల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నామన్నారు. మూడు విడతల్లో ప్రతి ఏడాది రైతుకు రూ.13,500 సాయం అందిస్తున్నామన్నారు. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా లబ్ది చేకూరుతోంది అన్నారు సీఎం.
ప్రతి రైతు ఖాతాలో 13,500 రూపాయలు వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి 51 వేల రూపాయలు అందించామని గుర్తు చేశారు. అలాగే రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం లక్ష్మన్నారు. అందుకే సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే 25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ది చేకూరుతోంది అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన దానికంటే మిన్నగా రైతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాయాన్ని అందిస్తోంది అంటున్నారు.