ఛత్తీస్ ఘడ్ లో మందు పాత్ర పేల్చిన మావోయిస్టులు…

ఇద్దరు జవాన్లు మృతి.                                  

 మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు.  
 తెలంగాణ సరిహద్దును ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని మందు పాత్ర పేల్చారు. ఈ సంఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడ మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కోట్లు యార్ అటవీ ప్రాంతంలో జవాన్లు హోమియో నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా మందు పాత్ర  పేల్చారు. శక్తివంతమైన మందు పాత్ర కావడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్ర గాయాలైన ఇద్దరు జవాన్లను మెరుగైన వైద్యం కోసం రాయ్ పూర్ తరలించారు. మృతి చెందిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపకు చెందిన రాజేష్ గా గుర్తించారు.
మరొకరు మహారాష్ట్రకు చెందిన అమర్ అన్వర్ గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు జవాన్లు ఐటి బిటి 53 బెటాలియన్ చెందిన వారిగా గుర్తించారు. ఆటో ప్రాంతంలో కూలి నిర్వహించుకుని వొస్తున్న ఐటిబిటి, బిఎస్ఎఫ్, డిఆర్ జి జవాన్లను మావోయిస్టు టార్గెట్ చేశారు. జవాన్ల టార్గెట్గా ఈ మందు పాత్రను పేల్చారు. గడిచిన జనవరి నుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ భారీగా దెబ్బ తగిలింది. సుమారుగా 185 మంది మావోయిస్టులు నష్టపోయారు. ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో భద్రతాభాలగాలు ఆ ప్రాంతం నుంచి కోమిలి నిర్వహించుకుని వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు మందు పాత్రను పేల్చారు.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశాయి. 2026 నాటికి మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ ఆమీత్ షా ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారీగా కేంద్ర బలగాలు  ఛత్తీస్ ఘడ్   రాష్ట్రంలోని అభి ప్రాంతాన్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ పట్టు సాధించుకోవడం కోసం మావోయిస్టు పార్టీ ప్రతి కార్యకర్తలకు పాల్పడుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page