ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టి, బిసిలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి బర్జేట్ ను2 లక్షల కోట్లకు పెంచాలని, కేంద్రంలో బిసిలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, తెలంగాణ కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షతన బీసీలు మహా ధర్నా నిర్వహించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైయస్సార్సీపి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అతిధిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలనుండి వందలాది మంది వివిధ బిసి సంఘాలు, అనుబంద సంఘాలకు చెందినా కార్యకర్తలు హాజరైయారు. అంతకు ముందు పార్లమెంటు వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున పొలిసు బలగాలను మొహరించారు. ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బిసిలకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని, త్వరలో జరుపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని డిమాండ్ చేసారు. అలాగే బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని, బిసిల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించాలని డిమాండ్ చేసారు. బిసిలకు పారిశ్రామిక పాలసీ లో 50 శాతం కోటా ఇవ్వాలని, హై కోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. ఈ మహా ధర్నాలో జిల్లపల్లి అంజి, అనంతయ్య, కర్రి వేనుమాదవ్, చౌటుపల్లి సురేష్, జలపల్లి కిరణ్, పండరినాథ్, రఘుపతి, వంశీ, మురళి, నాగేశ్వరరావు, పెండిప్రోలు రామ్మూర్తి, శ్రీమన్నారాయణ భూమన యాదవ్, రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.