జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ఎల్బీనగర్ జేఏసీ

హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇంతటి అమానుశానికి ఒడిగట్టిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎల్బీనగర్ జేఏసీ చైర్మన్ వి.ఎన్. రాజు డిమాండ్ చేశారు. శనివారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో వేములపల్లి లో జరిగిన దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజు మాట్లాడుతూ… ప్రభుత్వము జర్నలిస్టులకు ఒకవైపు ఇళ్ల స్థలాలు కేటాయించి, వాటిని బాగు చేస్తున్న క్రమంలో వారిపై దుండగులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ప్రత్యేక చట్టం తెచ్చి, బంగారు తెలంగాణలో అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టు జేఏసీ ముఖ్య సలహాదారులు పిడికిలి రాజు, సభ్యులు లింగయ్య, శ్రీనివాస్, రాజ్ కుమార్, మహేష్ ,శంకర్ రెడ్డి, చంద్రమౌళి,బిక్షం, పురుషోత్తం, సైదులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page