దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రంలోని నంది కమాన్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ జర్నలిస్టులకు నివేశన స్థలాలను కేటాయించింది. జర్నలిస్టుల కేటాయించిన నివేశన స్థలాల్లో శుక్రవారం పలువురు జర్నలిస్టులు తమ గృహ నిర్మాణాల పనుల ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, సీనియర్ పాత్రికేయులు బుడంగారి మహేష్, వేములవాడ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్ లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమనేని, మునిసిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, వార్డు కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడలో మరికొంతమంది జర్నలిస్టులకు నివేశన స్థలాలు త్వరలో కేటాయిస్తామని వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమనేని ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నరసయ్య, కాంట్రాక్టర్ మర్రిపల్లి మల్లేశం, నాయకులు మధు, ఖమ్మం గణేష్, పల్లెపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.