జాతి గౌరవం ‘గంగ’పాలు..!

‘‘‌తమ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తాజాగా తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాన్యత నిస్తున్నట్లు కనిపిస్తున్నది. మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికే పెద్ద పీఠ వేస్తున్నామన చెప్పుకునే మోదీ సర్కార్‌ ‌సంవత్సరకాలం దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఎలా పట్టించుకోలేదో, మహిళలు తమ మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని చేపట్టిన గోసకూడా పట్టడంలేదనడానికి రెజ్లర్ల నలభై రోజుల ఆందోళన చెప్పకనే చెబుతున్నది. కేవలం కమిటీల పేర తాత్సర్యం చేస్తోంది.’’

రెజ్లర్ల విషయంలో న్యాయనిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. గడచిన నలభై రోజులుగా తీసుకోలేకపోయిన చర్యలను ఆఘమేఘాలమీద ఈ నాలుగు రోజుల్లో తీసుకోవాల్సిన పరిస్థితిని రెజ్లర్లు కేంద్రానికి కల్పించారు. ఇప్పటికే భారతదేశ గౌరవ ప్రతిష్టలు విదేశాలముందు అభాసుపాలైనాయి. రెజ్లర్లు మంగళవారం తమ మాటను వెనక్కు తీసుకోని పక్షంలో ఆంతర్జాతీయ స్థాయిలో ఉన్న పరువుకూడా పోయేది. అఖిల భారత కిసాన్‌ ‌యూనియన్‌ (‌బికెయు) అధ్యక్షుడు నరేష్‌ ‌తికాయత్‌ ‌జోక్యం చేసుకోకపోతే అంతపని అయిఉండేది. దేశానికే తలమానికలుగా ఎంతో శ్రమించి, ప్రపంచ దేశాల్లో భారత గౌరవ పతాకాన్ని ఎగురవేసిన పతకాలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్ళిన ప్రముఖ రెజ్లర్లను తికాయత్‌ ‌నిరోధించక•పోతే ప్రపంచ క్రీడారంగంలో భారత ప్రతిష్ట  ఎంతవరకు దిగజారేవో ఊహించడం కష్టం. నలభై రోజుల్లో దేశ రాజధాని దిల్లీ  నడివీదుల్లో తమకు న్యాయం చేయాలని మహిళ రెజ్లర్లు  చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వంగాని, సంబంధిత  అధికార యంత్రాంగంగాని  పెద్దగా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. వారి ఆందోళనకు సుప్రీంకోర్టు స్పందించింది. చివరకు అంతర్జాతీయ క్రీడల గవర్నింగ్‌ ‌బాడీ యూనైటెడ్‌ ‌వరల్డ్ ‌రెజ్లింగ్‌ (‌యూడబ్లూడబ్లూ) కూడా తాజా ప్రకటనలో తన నిరసన తెలిపింది. వెంటనే ఈ ఆందోళనపై న్యాయవిచారణ జరిపి చర్యలు తీసుకోని పక్షంలో డబ్ల్యూఎఫ్‌ఐ ‌ని నిషేధించాల్సి వొస్తుందని అల్టిమేటమ్‌కూడా ఇచ్చింది. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే కేంద్ర ప్రభుత్వంగాని, సంబంధిత• శాఖ అధికార యంత్రాంగంగాని నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
      ఆందోళన చేస్తున్న రెజ్లర్లు అంతా అనామకులేమీకాదు. క్రీడారంగంలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించడమేకాకుండా, దేశానికే ప్రత్యేక గుర్తింపును తీసుకువొచ్చిన మేటి ధీరోదాత్తులు. ఒలంపిక్స్ ‌వేదికగా బంగారు, వెండితోపాటు అనేక ఇతర పతకాలను భరత మాత మెడలో అలంకరించినవారు. వీరంతా ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా తమ స్వలాభంకోసమో, గొంతెమ్మ కోర్కెలకోసమో చేస్తున్న ఆందోళనకాదిది. భారతదేశ ప్రతిష్ట, ఆత్మగౌరవానికి సంబంధించింది. భారత్‌ అం‌టేనే మహిళలకు ఇక్కడ ప్రత్యేక గౌరవ ప్రధమైన స్థానం ఉంటుందన్నది సనాతనంగా వొస్తున్నది. అలాంటి మహిళల గౌరవానికి భంగం వాటిల్లుతున్నదన్నదే ఈ పోరాటానికి ప్రధాన కారణం. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహాన్నివ్వాల్సిన వారే అవమానకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి వారిది. భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య అధ్యక్షుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఎంపీ కూడా అయిన బ్రిజు భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌  ‌తమపట్ల అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడన్నది వారి ఆరోపణ. తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గత నలభై రోజులుగా వారు రోడ్డెక్కితే కనీసంగానైనా కేంద్రం పట్టించుకోవడంలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు చేస్తున్న ఆందోళనకు యావత్‌ ‌దేశం వారికి మద్దతు పలుకుతున్నా కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు మాత్రం ఒక్క మాట మాట్లాడకపోగా, బ్రిజు భూషణ్‌ను సమర్థిస్తూ మాట్లాడటంపట్ల రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  అనేక విజ్ఞాపనలు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోడంతో ఏప్రిల్‌ 23‌న రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫోగట్‌ ‌దిల్లీలో  నిరసనకు దిగటంతో వీరి ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైంది. వినేష్‌ ‌ఫోగట్‌కు అనేక మంది పేరొందిన క్రీడాకారులు మద్దతు పలికారు. ఒలంపిక్‌ ‌గోల్డ్ ‌మెడలిస్టు నీరజ్‌ ‌చోప్రా, టెన్నిస్‌ ‌మాజీ క్రీడాకారిణి సానియా మిర్జా, బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీనా, హాకీ ప్లేయర్‌ ‌రాణీ రాంపాల్‌, ‌క్రికెటర్లు సెహ్వాగ్‌, ‌హర్భజన్‌, ఇర్ఫాన్‌ ‌పఠాన్‌, ‌తాజాగా మాజీ వెయిట్‌ ‌లిఫ్టర్‌ ‌కరణం మల్లేశ్వరి లాంటి వారనేకులు రెజ్లర్లకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
విచిత్రకర విషయమేమంటే ఒకపక్క దేశ, విదేశాల్లోని క్రీడాభిమానులు, మహిళ సంఘాలు విమర్శిస్తున్నా పార్లమెంట్‌ ‌నూతన భవన ప్రారంభోత్సవంనాడు మరోసారి కేంద్ర బలగాలు వారిపైన తమ ప్రతాపాన్ని చూపించాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్న రెజ్లర్లు పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా భవనంలోకి దూసుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిని ఈడ్చివేసి, వాహనాల్లో ఎక్కించుకు వెళ్ళిన దృశ్యాలకు అందరూ చలించిపోయారు. దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు పోలీసులును ఆదేశించిందంటేనే ఆ సంఘటన ఎంతటి భీబత్సకరంగా మారిందో అర్థమవుతున్నది. తమ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తాజాగా తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాన్యత నిస్తున్నట్లు కనిపిస్తున్నది. మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికే పెద్ద పీఠ వేస్తున్నామన చెప్పుకునే మోదీ సర్కార్‌ ‌సంవత్సరకాలం దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనను ఎలా పట్టించుకోలేదో, మహిళలు తమ మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని చేపట్టిన గోసకూడా పట్టడంలేదనడానికి రెజ్లర్ల నలభై రోజుల ఆందోళన చెప్పకనే చెబుతున్నది.
కేవలం కమిటీల పేర తాత్సర్యం చేస్తోంది. వాస్తవానికి క్రీడా శాఖ ఆధ్వర్యంలో  వేసిన కమిటీ ఏప్రిల్‌ ‌చివరివారంలోనే నివేదిక అందజేసినప్పటికీ రెజ్లింగ్‌ ‌సమాఖ్య అధ్యక్షుడు బ్రిజూభూషణ్‌పై తీసుకున్న చర్యలు మాత్రం ఏమీలేవు. ఆయన్ను వెంటనే ఆ పదవినుంచి తొలిగించాలన్న రెజ్లర్ల డిమాండ్‌పై కేంద్రం ఏమాత్రం స్పందించడంలేదు. చివరకు రాజకీయ పార్టీలు ఒక్కొక్కరిగా వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణరాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ ‌తాజాగా ట్విట్టర్‌ ‌ద్వారా తమ మద్దతు ప్రకటించగా, ఎంఎల్సీ కవిత కేంద్రం చేస్తున్న జాప్యంపై తీవ్రంగా విమర్శించారు. దేశంలోని పలుపార్టీల నేతలుకూడా తమ నిరసనను తెలియజేస్తున్నారు. కాగా, తికాయత్‌ ‌కేంద్రంతో సంప్రదింపులకు అయిదు రోజుల సమయం తనకు ఇవ్వాల్సిందిగా రెజ్లర్లను కోరిన మేరకు రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో కలుపాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే ఒకటిరెండు రోజులు గడిచిపోయినాయి. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే పార్టీగా చెప్పుకునే బిజెపి ప్రభుత్వం ఈ విషయ ంలో తీసుకునే నిర్ణయ ంపైనే మహిళా క్రీడా కారుల భవిష్యత్‌ ఆధా రపడి ఉంటుందం టున్నారు క్రీడాభి మానులు.
image.png
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page