Flag code 2002..చట్టం ఒకటుందని చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు..మనలో మనకి ఎన్ని వైరుధ్యాలూ.. విరోధాలూ ఉండొచ్చు.. ప్రభుత్వాలమీద.. రాజకీయ పార్టీల మీదా ఏ భావమైనా ఉండొచ్చు గాక.. కానీ దేశం విషయంలో దేశభక్తి విషయంలోనూ రెండో ఆలోచన ఉండకూడదు.. దేశ సార్వభౌమత్వాన్ని, మనం పుట్టిన గడ్డను.. మన జాతీయ పతాకాన్నీ గౌరవించి తీరాలి.. ప్రతీ దేశానికీ ఆదేశ జాతీయ జెండా గుండెకాయలాటిది.. యుద్ధంలో సైనికుడు తన తల తెగి పడ్డానికి సిద్ధపడతాడు గానీ జెండా చేయి జారడానికి ఒప్పుకోడు..
రేపు ఆగస్టు 15.. పిల్లలు.. పెద్దలు అందరూస స్కూల్ కెళ్ళి ఆఫీసుల కెళ్ళి జండా వందనం చెయ్యలేక పోవచ్చు..కానీ ఇళ్ళదగ్గర జండాలు కొనుక్కుని ముచ్చట తీర్చుకునే పిల్లలుంటారు.. అపార్టు మెంటుల్లో జండాలు ఎగరెయ్యొచ్చు కొందరు.. సాయంత్రం ఆ జండాని అవనతం చేసాక.. మర్నాడు. ఆ జండాలు ఇంకేరకంగా వాడినా.. పారేసినా.. ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారం దేశద్రోహమే.. చట్టాన్ని అలా ఉంచండి.. అలా పారెయ్యడం మనకే తప్పు కూడా.. ఐతే చాలా మందికి దాన్నేం చెయ్యాలో తెలీదు.. పాత బట్టల్లో పారేస్తారు
ఆ కోడ్ ప్రకారం.. వాడని.. పాతపడిపోయిన జాతీయ జండాని శ్రద్ధతో రెండు పద్ధతుల్లో డిస్పోజ్ చెయ్యాలి..
1.అగ్నికి అర్పించడం:- అంటే డైరెక్ట్ గా జండాకి నిప్పు పెట్టకూడదు.. చితి పేర్చి.. చితి మండుతున్నప్పుడు .. ఒకటికన్నా ఎక్కువ వున్నా ఆ జెండాలను మడతపెట్టి భక్తితో చితి మధ్యలో వాటిని వేసి పూర్తిగా ఆహుతి అయ్యేలా చూడాలి.. అది ఆహుతి అయ్యే సమయంలో మౌనం పాటించాలి.. అపార్ట్ మెంటుల్లో ఎలా అగ్ని వెలిగించడం అనుకోక్కర్లేదు.. ఒక బేసిన్ లో ఇసుక పోసుకుని.. దానిలో బాగా ఎండిన కర్రపేళ్ళు ఏ వడ్రంగినో, ఏ అడితీ వాళ్ళనడిగినా ఇస్తారు..వాటిని పేర్చి చెయ్యొచ్చు.. అసలు మనసే ఉంటే మార్గానికి దారిదొరుకుతుంది.
రెండో మార్గం.. ఇంటికి పెరడు ఉంటే.. పెరడులో కొంత మేర శుభ్రపరచి.. గొయ్యి తవ్వి.. ఈ జెండాలను ఒక చెక్క పెట్టిలో మాత్రమే పెట్టి అందులో పెట్టి మట్టితో పూడ్చెయ్యడం.. అప్పుడూ మౌనం పాటించాలి..
ఇదీ ఫ్లాగ్ కోడ్ 2002 చట్టం సారాంశమని కొందరు న్యాయవాదులు తెలిపారు…
ఈ శ్రద్ధ…, ఈ ఓపిక లేనివారు దయచేసి పిల్లలకు జెండాలు ఇవ్వొద్దు.. మీ మీ అపార్ట్ మెంటుల్లో గానీ వేరే ప్రైవేట్ స్థలాల్లో గానీ జెండా ఎగరెయ్యవద్దు. ఎవరో చూస్తారని.. ఏదో ఔతుందని కాదు.. మన అంతరాత్మలే మనకి సాక్ష్యం..
తల్లిని ప్రేమించేవారు.. దేశాన్ని.. జాతీయ జెండాని ప్రేమిస్తారు..
అమ్మతనానికి.. జాతీయ జెండాకి కులం.. మతం ఉండదు..
ఇది అందరికీ తెలియడం అవసరం..మంచిది కూడా..