శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన యాదవ హక్కుల డిమాండ్స్ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఎస్ ఎన్ టి రిజర్వేషన్ పునరుద్ధరణ 3, జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ నామినేటెడ్ పదవులలో అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని , హామీ ఇచ్చిన విధంగా రెండవ విడత గొర్ల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఖ్య బలంగా గుర్తించి యాదవులను ఓటు బ్యాంకు కోసమే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించడానికి కార్యచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ సంఘం అధ్యక్షులు మేకల రాములు, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం అధ్యక్షులు రవి, సాయన్న యాదవ్ ,శ్రీహరి యాదవ్, రాధాకృష్ణ యాదవ్, బాలు యాదవ్, కుమార్ యాదవ్, పవన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్ మొదలగువారు పాల్గొన్నారు.