ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం మవుతుందని రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, తలకొండపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపురం, వెల్జాల్ గ్రామ పంచాయితీ ఇస్రాయిపల్లి గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ.ఆర్.ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రతి గడపగడపకు చేరాయన్నారు. ఈ తెలంగాణ దేశానికే దిక్సుచిగా మారిందని కల్వకుర్తి ప్రాంతంలో జైపాల్ యాదవ్ ను మరో సారి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, జడ్పీ కో ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, రైతుసమన్వయ కమిటీ అధ్యక్షుడు నర్సింహ, మాజీ ఎంపీటీసీ అడ్వకేట్ ఆంజనేయులు గౌడ్, గ్రామ కమిటి అధ్యక్షులు. నిరంజన్, శ్రీకాంత్ యాదవ్, నాయకులు రామస్వామి, మల్లేష్, జంగయ్య, రాజు, శ్రీనివాస్ గౌడ్, బాలస్వామి, వెంకటయ్య, అంజయ్య, కృష్ణయ్య, రాజు, కిరణ్, శేఖర్, యాదయ్య, పాండు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,
గ్రామస్తులు, మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.