ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో గెలుపొందాలని కోరుతూ కడ్తాల్ మండలంలోని పోచమ్మ గడ్డ తండా గిరిజన మహిళలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జైపాల్ యాదవ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కల్వకుర్తి లో జైపాల్ యాదవ్ ను గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో భిక్య శారదా దేవి, లక్ష్మి, శాంతి, ప్రమిల, సోనా, అనిత, బుజ్జి, లాలి, సక్రి, కవిత, విజయ, సరిత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.