వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన
న్యూయార్క్, నవంబర్ 14 : ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు, టెక్ సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించాడు. విటర్ లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మాస్క్ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మరికొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లోని ఔట్ సోర్సింగ్ విభాగంలో భారీగా లే ఆఫ్ లు ప్రకటించారు. దాదాపు 5,500 మందికిపైగా ఉద్యోగుల్లో 4,400 మందిని ఉద్యోగాలనుంచి తొలగించినట్లు సమాచారం.
వాళ్లలో ట్విటర్ కు చెందిన కంటెంట్ మాడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, శనివారం రోజు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి జాబ్ లో నుంచి తొలగించారని ఉద్యోగులు చెబుతున్నారు. వాళ్లలో చాలామందికి సిస్టమ్స్ లో లాగిన్ యాక్సెస్ కోల్పోయాకే ఉద్యోగాలు పోయినట్టు తెలిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు పక్రియ కంపెనీ డైరెక్టర్లకు, మేనేజర్లకు కూడా తెలియదట.