టొరంటోలో తెలంగాణ కెనడా సంఘం ధూమ్ ధామ్ వేడుకలు

  • ఆద్యంతం అంబ‌రాన్నంటిన సంబ‌రాలు..

  • తెలంగాణ సంస్కృతి ప్ర‌తిబింబించేలా ఆట‌పాట‌లు..

టోరంటో, జూన్ 9 : కెనడాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌లు అంబ‌రాన్నంటాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను ధూమ్ ధామ్ పేరు (TCA DHOOM DHAM CELEBRATIONS 2024) తో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో సుమారు 1800 కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.
ఈ ఉత్స‌వాల‌ను కమిటీ సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర ప్రారంభించగా, స్వాతి మన్నెం, అమృత దీప్తి కర్రి, కవిత తిరునగరి, ప్రసన్న మేకల, స్ఫూర్తి కొప్పు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఐక్య ఏర్ర గణేష వందనంతో ధూమ్ ధామ్ 2024 సంబరాలు ప్రారంభ‌మ‌య్యాయి.

TCA DHOOM DHAM CELEBRATIONS
TELANGANA CANADA ASSOCIATION

ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ శ్రీనివాస్ మన్నెం, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా పాల్గొన్నారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి తెలంగాణ ప్రాముఖ్యతని, అభివృద్ధిని కొనియాడుతూ, తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులకు, కెనడాలో నివసించే తెలంగాణవాసులకు, సంస్థ శ్రేయోభిలాషులకు వాట్సప్ కాల్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ధూమ్ ధామ్ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల త‌దిత‌రులు నాలుగు గంటల పాటు వ్యాఖ్యాతలుగా ప్రేక్షకులను అలరించారు. ఈ సంబరాలలో కూచిపూడి నృత్యాలయం వారిచే ప్రదర్శించబడిన అదిగో అల్లదిగో, కృష్ణం వందే జగద్గురుం, గోవిందా అని కొలవరే, రామాయణ శబ్దం, మరో వేదిక డాన్సింగ్ దియాస్ బోనాల జాతరకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించినది.

TELANGANA CANADA ASSOCIATION

అనంతరం అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. TCA ఈవెంట్స్ స్పాన్సర్లకు, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ తో కలర్ ఫుల్ గా నిర్వ‌హించ‌డంపై పలువురు ప్రశంసించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణలో అత్యంత పాపులర్ అయిన‌ బిర్యానీ అంద‌రికీ వ‌డ్డించారు. చివరగా అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కెనడా టొరంటోలో ఘనంగా ముగించారు.

కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ ఏర్ర, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు – శంకర్ భరద్వాజ పోపూరి, నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శ్రీరంజని కందూరి, భగీరథ దాస్ అర్గుల, ప్రవీణ్ కుమార్ సామల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – ప్రసన్న మేకల, మురళీధర్ కందివనం, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు – కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రావుల్, శ్రీనివాస తిరునగరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, అఖిలేష్ బెజ్జంకి, కలీముద్దీన్ మొహమ్మద్, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల, విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంబాలపల్లి, పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page