- కెసిఆర్‌తోనే అది సాధ్యం
- దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ
- వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి
- విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అద్భుత ప్రగతి
- మోదీ పాలనలో అంతా వైఫల్యమే..
- మోటర్లకు మీటర్లు పెట్టమంటే పెట్టమని చెప్పినం
- దేశమంటే ఆదానీ, ప్రధాని మాత్రమే కాదు…
- 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం
- ఈటల బిఆర్‌ఎస్ ఉన్నప్పుడు మంచిగుండె..బిజెపిలకు పొయినాంక మారిండు
- మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే..ఎందుకంటే ప్రజలంతా కెసిఆర్ కుటుంబ సభ్యులే
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి మంత్రి కెటిఆర్ సమాధానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమవుతూ…కెసిఆర్ సమర్థ నాయకత్వంలో ముందుకు సాగుతూ..దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. 8 ఏళ్ల పాలనలో అద్భుత విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ఇదే క్రమంలో కేంద్రం ఎలాంటి సహకారం అందించకపోయినా ముందుకు సాగుతున్నదని, కేంద్రంలో లాగా అసమర్థ పాలన ఇక్కడ లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి సిఎం కెసిఆర్‌కు బదులుగా కెటిఆర్ అసెంబ్లీలో సమాధానం చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగుతాగునీటి రంగాలతో పాటు విద్యుత్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అందుకే ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందన్నారు. దేశానికి డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని నిరూపించామన్నారు.
తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. అందుకే దేశం కెసిఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తుందని అన్నారు. 24 గంటల కరెంట్ విప్లవాత్మకమన్నారు. కరెంట్ కష్టాలను పారదోలిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. వ్వయసాయానికి నీళ్లు అందించడంతో ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రైతులు పంటలు పండించే అవకాశ వొచ్చిందన్నారు. రైతై పాలకుడైతే పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి తెలంగాణయే నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. సీఎం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక మానవీయత ఉంటుందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని, ఐక్యరాజ్యసమితి కూడా రైతు బంధును ప్రశంసించిన విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు తీసుకునే వారిలో 98శాతం చిన్న, సన్నకారు రైతులేనన్న కేటీఆర్.. రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్ధేశ్యంతో రైతు బీమా పథకం తీసుకొచ్చామన్నారు.
ఇప్పటి వరకు 94,500 కుటుంబాలకు రైతు బీమా అందించినట్లు వివరించారు. నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు. బియ్యం ఉత్పత్తిలో పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే కేంద్రం తెచ్చిన నల్లచట్టాలకు 700మంది రైతుల బలికావడంపై బిజెపికి కొంతకూడా పాశ్చాత్తాపం లేకుండా పోయిందన్నారు. 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడని, కానీ బీజేపీలోకి వెళ్లాక ఆయనలో మార్పు వొచ్చిందని అన్నారు. కమలం పార్టీలోకి వెళ్లాక మనుషులు మారిపోతారని విమర్శిం చారు. రాష్ట్రంలో కేసీఆర్ రాక ముందు కరెంట్ ఎలా ఉండేదో వొచ్చాక ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. అప్పట్లో పవర్ హాలిడేస్ ఉంటే.. ఇప్పుడు పవర్ ఫుల్ డేస్ అని చెప్పారు. రాష్ట్రంలో మోటార్లకు వి•టర్లు ఎందుకు పెట్టాలని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మోటార్లుకు వి•టర్లు పెట్టాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసిందని.. అయితే వి•టర్లు పెట్టమని స్పష్టం చేశామని చెప్పారు.
కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో కేంద్రం పప్పులుడకవన్నారు. విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న కేటీఆర్ గుజరాత్‌లో విద్యుత్, నీటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్లుగా గుజరాత్‌లో పాలన ఉందని విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు ఇక్కడ కేవలం ఐదు మెడికల్ కాలేజీలు, ఏడు వందల సీట్లు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 2790, ప్రైవేటు కాలేజీల్లో 3800 కలిపి మొత్తం తెలంగాణలో 6590 ఎంబీబీఎస్ సీట్లు ఇవాళ తెలంగాణలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇంకా కొత్త ఆసుపత్రులో తెలంగాణలో బ్రహ్మాండంగా కడుతున్నామని, తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద ఆసుపత్రి, వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో వరంగల్‌లో కడుతున్నామని, 24 అంతస్తులు, రెండువేల పడకలతో సకల హంగులతో నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇదే కాదు హైదరాబాదులో గల్లీ గల్లీకో ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నా మని మంత్రి వెల్లడించారు. ఇవాళ రెండోసారి రాష్ట్ర ప్రజలకు కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. కంటి వెలుగులో కంటి పరీక్షలే కాదు అత్యంత నాణ్యమైన కళ్లద్దాలు కూడా ఇస్తున్నామని, అదీ మెడ్ ఇన్ తెలంగాణ అద్దాలు ఇస్తున్నామని చెప్పారు. వి మోదీ మెక్ ఇన్ ఇండియా ఎక్కడవోయిందోగానీ మా మేక్ ఇన్ తెలంగాణ మాత్రం కళ్లముందు కనవడుతున్నదని చెప్పారు.
దేశమంటే ఆదానీ, ప్రధాని మాత్రమే కాదు…30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం
గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానం ఇచ్చే క్రమంలో ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ విరుచుపడ్డారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. దేశమంటే ఆదానీ, ప్రధాని మాత్రమే కాదన్నారు. మోదీ పాలనలో మన దేశం అన్నీంటిలో హైయేస్టేననన్నారు. 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ దేశంలో నమోదయిందని మంత్రి అన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం చేరుకుందన్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్ సిలిండర్ ధర ఇవాళ ఇండియాలో ఉందని, నాలుగు వందల రూపాయల సిలిండర్ ధరను 12వందలు చేసి మన ఆడ బిడ్డలకు ప్రధాని మోదీ విలువైన కానుక ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవ చేశారు. ఇవే కాదు ప్రపంచలోనే అత్యంత ఎక్కువ పెట్రోలు ధర కలిగిన మూడో దేశం మనదని కేటీఆర్ అన్నారు.
ఈ హైయెస్ట్ ఘనతలే కాదు మోడీ ఘనకార్యాలు, అమలు కాని హావి•లు ఇంకా చాలా ఉన్నాయన్నారు. గూగుల్ వెతికితే 2018లో మోదీ ఇచ్చిన హావి•లు దొరికాయని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో సభకు తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని, దేశంలోని ప్రతి పౌరుడికి సొంత ఇల్లు కట్టిస్తామని, దేశమంతా బుల్లెట్ రైళ్లు పరుగెడతాయని, 2022కల్లా దేశంలోని ప్రతి ఇంటికి కరెంటు ఇస్తామని మోదీ హావి• ఇచ్చారు. వొచ్చిందా కరెంటు అని మంత్రి ప్రశ్నించారు. 2022 కల్లా దేశ ఆదాయాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లు చేస్తామని, బారతదేశం నుంచి అంతరిక్షంలో అస్ట్రోనాట్లను పంపుతామని మోదీ ఇచ్చిన హావి•లు ఏమయ్యాయని కేటీఆర్ సభలో ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు కడుతరా?.. అందులో ఎంత అవినీతి పొంగుతుందో అని బీజేపీ నేతలు అరుస్తున్నరని మంత్రి అన్నారు. మరి లక్షా పదివేల కోట్లు పెట్టి అహ్మదాబాద్ నుంచి ముంబయికి బుల్లెట్ రైలు వేస్తే తప్పులేదు కానీ లక్షలాది ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టు కడితే తప్పా అని కెటిఆర్ నిలదీశారు. అంత ఖర్చు పెట్టి బుల్లెట్ రైలు అవసరమా అని ప్రతిపక్షాలు అడిగినపుడు బుల్లెట్ రైలు అక్కర్లేదన్నవారు ఎడ్లబండిపై తిరగండని మోదీ హేళన చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే..ఎందుకంటే ప్రజలంతా కెసిఆర్ కుటుంబ సభ్యులే
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుందన్న ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబసభ్యులేనన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని చెప్పారు. అందుకే కుటుంబ పాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితుండని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని అన్నారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని చెప్పారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని అన్నారు. ప్రతిపక్షమంటే పక్షపాతంగా వ్యవహరిం చాలని, ఎప్పుడూ విమర్శ చేయాలనుకోవడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంచి చేసినపుడు అప్పుడప్పుడైనా సమర్థించాలని అన్నారు.
కేసీఆర్ పాలన తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న కేటీఆర్.. దేశానికి రాష్ట్రం ఆదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వంలో పైరవీకారులకు చోటు లేదని, పథకాల కోసం లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమస్య తీరిపోయిందని, నిధుల వరద పారుతోందని, నియామకాల కల కూడా సాకారమవుతోందని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అనుమానాలను పటాపంచెలు చూస్తూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్లలెలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయని, గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నిజమవుతోందని కేటీఆర్ అన్నారు. దేశంలో అభివృద్ధిచెందిన 20 గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయన్న ఆయన.. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తోందని చెప్పారు. 75ఏండ్లలో ఏ నాయకుడు చేయని అభివృద్ధిని కేసీఆర్ చేస్తుండని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఆయన నాయకత్వం కోరుకుంటోందని అన్నారు. రైతే పాలకుడైతే పాలన ఎలా ఉంటుందనడానికి తెలంగాణెళి నిదర్శమని కేటీఆర్ చెప్పారు.