డిండిలో చిక్కుకున్న చెంచులను కాపాడిన సిబ్బంది

రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పనిచేసిన పోలీసులు
పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి జితేందర్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలుగు రాష్టాల్రను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదీ తీర ప్రాంతలోని ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. బాధితుల సహాయార్ధం పోలీసులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా డిరడీ నది నీటిలో చిక్కుకున్న 10 మంది చెంచు గిరిజనులను నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పోలీసులు రక్షించారు. నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పోలీసులు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ లో పాల్గొన్న పోలీసులను రాష్ట్ర డిజిపి జితేందర్‌ అభినందించారు. డిరడీ మండలంలోని గోనెబోయినపల్లి గ్రామానికి చెందిన 10 మంది చెంచు గిరిజనులను, డిరడీ నది పెరుగుతున్న వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని విజయవంతంగా రక్షించారు.

 

డిరడీ మండలంలోని గోనమోని పల్లి గ్రామానికి చెందిన గిరిజనులు భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడంతో డిరడీ కత్వ వద్ద చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మత్స్యకారులు, పడవల సాయంతో.. వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షితం ప్రాంతానికి తీసుకుని వచ్చారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి, అవసరమైన వైద్య సహాయం మరియు సహాయక సామగ్రి అందించారు. వర్షాకాలంలో పోలీసులు, ్గడిపార్టుమెంటు  బృందాల సామూహిక కృషిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

ప్రతి పౌరుడి భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని అధికారులను ప్రశంసిస్తున్నారు. వర్షాలు, వరదల నేపధ్యంలో జిల్లా యంత్రాంగం తక్కువ మట్టం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలనీ సూచిస్తున్నారు. ఈ తరహా ఘటనలను నివారించడానికి అధికారులు జారీ చేసే అన్ని భద్రతా సూచనలను పాటించాలని సూచించింది. డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ లీడర్‌షిప్‌ను ప్రశంసించారు. డీజీపీ డేవరకొండ, ఆచంపేట డిరడీ,ఆచంపేట పోలీసులు చేపట్టిన ధైర్యవంతమైన రెస్క్యూ చర్యలకు కూడా అభినందించారు.

పెన్‌గంగ ప్రాంతంలో మంత్రి శ్రీధర బాబు పర్యటన
బ్యాక్‌ వాటర్స్‌ తో  నష్టం
ఆదిలాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: జిల్లాలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పర్యటించారు. జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న పెన్‌ గంగ నది ఉద్ధృతిని పరిశీలించారు. బ్యాక్‌ వాటర్‌తో వందలాది ఎకరాల పంట చేలు నీట మునిగాయని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మంత్రికి వివరించారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్‌ రాజర్ది షాను మంత్రి ఆదేశించారు. అంతకుముందు పట్టణంలో మూత పడ్డ సిమెంటు పరిశ్రమను సందర్శించారు. కేంద్ర సహకారంతో పరిశ్రమను తెరిపించి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్‌, ఎస్పీ గౌష్‌ ఆలం, కాంగ్రెస్‌, భాజపా శ్రేణులు ఉన్నాయి. ఇదిలావుంటే  బోథ్‌ ఎమ్మెల్యే అనిలాజాదవ్‌ మంగళవారం మండలంలో పర్యటించారు.
అర్లి`టి గ్రామ శివారులో నీటమునిగిన పంటచేలను పరిశీలించారు. ఇందుకోసం వాగుదాటి పంటచేలకు వెళ్లి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట మునిగిన పంటలకు ఎకరాకు రూ.40వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల వారీగా పంటలను పరిశీలించి జాబితాను రూపొందించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో తిరిగారు. ప్రజలను పలకరిస్తూ సమస్యలపై ఆరాతీశారు. కప్పర్ల ఎక్స్‌ రోడ్డు సవిూపంలో లోతట్టు వంతెనను పరిశీలించి రాకపోకలు నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్బి అధికారులను కోరతామన్నారు. దనోరలో మృతిచెందిన మేకల నారాయణ కుటుంబీకులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్‌ నాగయ్యయాదవ్‌, మాజీ జడ్పీటీసీ సుధాకర్‌, నాయకులు లస్మన్న, సంజీవరెడ్డి, గోవర్ధన్‌ యాదవ్‌, రాకేష్‌, ఉల్లాస్‌, నరేందర్‌, కల్చాప్‌, గంగయ్య, కపిల్‌, అఫ్రోజ్‌, నితిన్‌, ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page