తగ్గేదేలే అంటున్న బిసిలు!

  • పునరాలోచనలో బిఆర్‌ఎస్‌ అధిష్టానం ్డ మెదక్‌ ఎం‌పిగా ఎన్‌ఎంఆర్‌కు ఛాన్స్?
  • డ్ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటున్న మధు..
హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 7 : అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటాంచడం సొంత పార్టీలో అగ్గిని రాజేస్తూనే ఉంది. రాజకీయ ప్రకం• •నలు కొనసాగుతూనే ఉన్నాయి. సిఎం కేసీఆర్‌ ‌ప్రకటన తర్వాత టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆశావహులందరూ తీవ్ర అసం తృప్తికి గురయ్యారు. అసంతృప్తితో కొంత మంది పార్టీని వీడుతుండగా…మరి కొందరు మాత్రం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వంటి సీనియర్లు రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్‌ ‌రావు రంగంలోకి దిగడంతో చాలా వరకు సమస్యలు సద్దుమణిగినప్పటికీ…ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని పటాన్‌చెరుకు చెందిన బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకుడు, చిట్కూల్‌ ‌సర్పంచి, ముదిరాజ్‌ ‌మహాసభ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరా• •(ఎన్‌ఎంఆర్‌)‌సమస్య మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదనీ అత్యంతమైన విశ్వసనీయ వర్గాలు గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’కు తెలిపాయి.
బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను సిఎం కేసీఆర్‌ ‌ప్రకటించి సుమారుగా 20రోజులు కావస్తున్నప్పటికీ ప•టాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్‌ ‌వ్యవహారం సొంత పార్టీలోని అగ్గిని రాజేస్తూనే ఉంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్‌ ‌వొస్తుందని గట్టి దీమాతో ఉన్న నీలం మధు ముదిరాజ్‌ ‌టికెట్‌ ‌రాకపోవడంతో రాష్ట్రంలో 60 లక్షల ముదిరాజ్‌ ‌వోటర్లు ఉన్నా…కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించకపోవడం దారుణమనీ,  తమ సామాజిక వర్గం ఏం పాపం చేసిందంటూ లేవనెత్తిన ఒకే ఒక ప్రశ్నతో రాష్ట్రంలోని బిసిలతో పాటు ముదిరాజ్‌లందరూ రోడ్డుపైకి వొచ్చారు.  చిట్కూల్‌కు వెళ్లి నీలం మధుకు మద్దతు తెలుపుతున్నారు. మేమంతా మీ వెంటే ఉన్నామంటూ సంఘీభావంగా రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు చేపట్టారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోనైతే ప్రతి రోజూ ఏదో ఓ గ్రామంలో మధుకు మద్దతుగా బిసిలు, ముదిరాజ్‌లు ఆందోళనలు, నిరసన ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్నారు.

image.png

నీలం మధు ముదిరాజ్‌కు మద్దతుగా  తరలివచ్చిన బిసి నేతలు
తగ్గేదేలే అంటున్న బిసిలు, ముదిరాజ్‌లు..
పటాన్‌చెరు బిఆర్‌ఎస్‌ ‌రాజకీయం తెగ హీట్‌ను పుట్టిస్తుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి మరోసారి టికెట్‌ ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. మరోసారి కూడా పార్టీ నుంచి టికెట్‌ ‌దక్కించుకున్న ఆయన హ్యాట్రిక్‌ ‌విజయం కొట్టాలని చూస్తున్నారు. అయితే, ఆయనపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అదే పార్టీకి చెందిన నీలం మధు ముదిరాజ్‌ ‌టికెట్‌ ‌కోసం గట్టిగా ప్రయత్నించారు. ఎమ్మెల్యేకు ధీటుగా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఇక్కడ ముదిరాజ్‌ ‌కమ్యూనిటితో పాటు బిసిల వోట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో…తనకే టికెట్‌ ‌వొస్తుందని మధు ఆశలు పెట్టుకున్నారు. కానీ, మూడోసారి కూడా గూడెం మహిపాల్‌ ‌రెడ్డికే టికెట్‌ ‌ప్రకటించటంతో మధు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అసమ్మతి గళం షురూ అయింది. టికెట్‌ ఆశించి భంగపడ్డ నీలం మధు ముదిరాజ్‌ ‌రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. బిసి సామాజికవర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చేలా కార్యచరణను సిద్ధం చేయటంతో పాటు బల ప్రదర్శలను చేపడుతున్నారు.
నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్‌ ‌సామాజికవర్గం వోట్లు ఉన్న నేపథ్యంలో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్‌ ‌విసురుతున్నారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్‌ ‌హైకమాండ్‌ ‌దిద్దుబాటు చర్యలను చేపట్టింది. రంగంలోకి దిగిన మంత్రి హరీష్‌రావు మధును ప్రగతిభవన్‌కు పిలిపించి సముదాయించారనీ సమాచారం. మధు ఏమాత్రం మెత్తబడలేదనీ తెలుస్తుంది. అధిష్టానం సముదాయించినప్పటికీ బిసిలు, ముదిరాజ్‌లు మాత్రం తమ ఆందోళననలు, నిరసనలు మాత్రం ఆపిన దాఖలాలు లేవు. పటాన్‌చెరు టికెట్‌ ‌కొరకు మధు పార్టీ అధిష్టానంపై వొత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. నీలం మధు ముదిరాజ్‌కు టికెట్‌ ఇవ్వాలని ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ముదిరాజ్‌ ‌సామాజికవర్గానికి ఒక్క టికెట్‌ ఇవ్వలేదని కనీసం పటాన్‌చెరు టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ‌వినిపిస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో బిసి నేతలందరూ ఏకమవుతుండటంతో  సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా  తలనొప్పిగా మారిందని తెలుస్తుంది.
పునరాలోచనలో అధిష్టానం… మెదక్‌ ఎం‌పిగా మధు?
బిసి నినాదంతో మధుకు టికెట్‌ ఇప్పించుకునేందుకు యావత్‌ ‌బిసిలందరూ ఆదిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ అధిష్టానంపై వొత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు.  పటాన్‌చెరు టికెట్‌పై పునరాలోచన చేయాలని గట్టిగా కోరుతున్నారు. టికెట్‌ ‌రాకపోతే ఇతర పార్టీల నుంచైనా లేదా స్వతంత్రంగానైనా బరిలో ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు కూడా వొచ్చాయి. ఇదే జరిగితే అధికార బిఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవనీ గ్రహించిన పార్టీ అధిష్టానం మంత్రి హరీష్‌రావును రంగంలోకి దించి మధుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, మధు ససేమిరా అనడంతో…పునరాలోచనపడ్డ అధిష్టానం దిద్దుబాటు చర్యల్లో భాగంగా వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మధుకు మెదక్‌ ‌పార్లమెంటు అభ్యర్థిగా అవకాశాన్ని ఇవ్వనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. మెదక్‌ ఎం‌పిగా నీలం మధుకు టికెట్‌ ఇచ్చి బిసిలు, ముదిరాజ్‌లకు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న సందేశం ఇవ్వాలని చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మెదక్‌ ఎం‌పిగా మధుకు టికెట్‌ ఇచ్చేందుకు బిఆర్‌ఎస్‌ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయానికి వొచ్చినప్పటికీ..మధు మాత్రం పటాన్‌చెరు ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపెడుతున్నట్లు ఆయన సన్నిహితుడొకరు గురువారం ‘ప్రజాతంత్ర’కు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page