తనను నమ్మి ప్రజలు 135 సీట్లు ఇచ్చారు

  • ఇంతకు మించి గిఫ్ట్ ఏముంటుంది
  • హైకమాంట్‌ ఇం‌తకుమించి ఏం గిఫ్ట్ ఇస్తుంది
  • పుట్టిన రోజు వేడుకల్లో డికె శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • డికెతో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ ‌రణ్‌దీప్‌ ‌సూర్జెవాల మంతనాలు

బెంగళూరు,మే15 : తనను నమ్మి కర్నాటక ప్రజలు 135 సీట్లిచ్చారరని అంతకుమించి పుట్టిన రోజు కానుక మరోటి ఉండదని కాంగ్రెస్‌ ‌కర్నాటక అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అన్నారు. సోమవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన కర్ణాటక ప్రజలు తనను నమ్మి 135 సీట్లు ఇచ్చారని ఇంతకు మించి ఏం గిప్ట్ ఉం‌టుందన్నారు.  పార్టీ హైకమాండ్‌ ‌తనకు పుట్టిన రోజు గిప్ట్  ఏమిస్తుందో తెలియదని అన్నారు. ఇదిలావుంటే డికె పుట్టిన రోజు కార్యక్రమంలో సిద్దరామయ్య, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రణ్‌దీప్‌ ‌సుర్జేవాల పాల్గొన్నారు. మరోవైపు కర్ణాటక సీఎం సీటు పంచాయతీ కొలిక్కి రావడం లేదు. రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ ‌పోటీపడుతుండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతోంది. 14న సీఎల్పీ టింగ్‌ ‌జరిగినా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. బంతి ఢిల్లీ కోర్టుకు చేరింది. ఇపుడు హైకమాండ్‌ ‌సీఎంఎంపికపై సందిగ్ధంలో పడింది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.  ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు.  మరి డీకే శివకుమార్‌ ‌వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సీఎం ఎంపికపై  ఏర్పాటు చేసిన ఏఐసీసీ అబ్జర్వేషన్‌ ‌కమిటీ కూడా ఢిల్లీకి వెళ్లింది.••ష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌చార్జ్  ‌రణదీప్‌ ‌సూర్జేవాలతో డీకే శివకుమార్‌ ‌భేటీ అయ్యారు. దాదాపు3 గంట పాటు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా తాను కాంగ్రెస్‌కు ఎంతో చేశానని ఇస్తే సీఎం పదవి ఇవ్వాలని సూర్జేవాలతో డీకే చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఇవ్వకుంటే అసలు కేబినెట్‌లో పదవి వద్దని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై డీకే శివకుమార్‌ ‌తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామంతా ఒక ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని, సీఎంను డిసైడ్‌ ‌చేసే అంశాన్ని పార్టీ హైకమాండ్‌కు వదిలేశామని డీకే స్పష్టం చేశారు. ఢిల్లీకి తాను వెళ్లాలా, వద్దా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. తనకు ఏ పని అప్పగించారో ఆ పని పూర్తిచేశానని కర్ణాటక కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌డీకే శివకుమార్‌ ‌వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం ఇచ్చిన టాస్క్‌ను తాను పూర్తిచేశానని, ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే ఉందనే అర్థం వచ్చేలా డీకే వ్యాఖ్యానించడం గమనార్హం. తన పుట్టినరోజని, కొన్ని పూజలు చేయాలని డీకే చెప్పారు. తన విశ్వాసం ప్రకారం ఆ పూజలే తనను కాపాడుతాయని డీకే శివకుమార్‌ ‌చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. కర్ణాటక కాంగ్రెస్‌ ‌కోసం ఏం చేయాలో అవన్నీ చేశానని, బీజేపీ ప్రభుత్వం తనను కేసులతో వేధించినప్పుడు సోనియా, కాంగ్రెస్‌ ఆదుకున్నాయని తెలిపారు. అధిష్టానానికి ఇప్పటికీ విధేయుడిగా ఉన్నానని సంకేతాలు పంపేలా డీకే శివకుమార్‌ ‌వ్యాఖ్యానించడం గమనార్హం. కర్ణాటక ప్రజలు తనను, కాంగ్రెస్‌ను నమ్మారని డీకే శివకుమార్‌ ‌చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page