మనిషి మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తూ
గతి తప్పిన ఋతుపవనాలతో
దెబ్బతిన్న సమతుల్యతతో
ఓ వైపు కుండపోత వర్షాలు,
మరొకవైపు ఉష్ణగాలులు
ఇంకోవైపు కరవుకాటకాలు.
ఈ ఉత్పాతాలకు
కారకులెవరు?
ఈ మార్పులు
మానవప్రేరితాలు కావా?
ఓ మనిషీ!
ఒక్కసారి యోచించు.
నువ్వు పుట్టింది ప్రకృతిలో,
జీవిస్తున్నదీ ప్రకృతిపై ఆధారపడే
కలిసిపోయేదీ ప్రకృతిలోనే.
నీ స్వార్థం కోసం
ప్రకృతిని ఛిద్రం చేసి
ప్రకృతి ప్రకోపానికి కారణమై
ప్రకృతి ప్రళయాలకు దారితీయడానికి
కారణమూ నీవే!
నీ చేతలు జీవుల మనుగడకే
సవాల్ గా మారాయని తెలుసుకో
ప్రకృతిని ఆరాధిస్తూ పరిరక్షించు
నిన్ను నీవు రక్షించుకో…
– వేమూరి శ్రీనివాస్, 9912128967, తాడేపల్లిగూడెం
ఇటీవల మన దేశంలోనూ మరి కొన్ని దేశాల్లో కురుస్తోన్న విపరీతమైన వర్షాలు మరి కొన్ని దేశాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 13 ప్రకృతి విపత్తుల నివారణా దినోత్సవం సందర్భంగా)