- నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు
- అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్ జోన్, ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని, దీంతో రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.
బుధవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మంత్రులు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అక్కడి పరిస్థితులను సీఎంకు ఫోన్ ద్వారా వివరించారు.