తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులు

  • ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లం అంటూ మోడీకి హెచ్చరిక
  • మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న కెసిఆర్‌

‌తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే వి•రే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణను కదిలించకండి.. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు. మేం ఉద్యమ వీరులం. ఉద్యమం చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. వి•రే భంగపడుతారు. పంజాబ్‌కు అవలంబిచిన విధానాన్నే మాకు అవలంభించండి. మేం కోరేది గొంతెమ్మ కోర్కె కాదు. పండించిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకు సేకరించిండి. వి•రే మిల్లింగ్‌ ‌చేసుకోండి.. పూర్తి స్థాయిలో సహకరిస్తాం.

పంజాబ్‌లో కొన్నట్టే మా ధాన్యం కొని డబ్బులు ఇచ్చేయ్‌. ‌దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగ బద్ధమైన విధిని కేంద్రం నెరవేర్చాలి. దీన్ని నుంచి కేంద్రం తప్పించుకోవద్దని కేసీఆర్‌ ‌సూచించారు.రోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ విధంగానే రేపు పొద్దున కరువు కాటకం వస్తే అన్నం పెట్టే స్థితిలో ఉండాలి. ఏ దేశానికి కూడా ఇండియాకు వారం రోజులు అన్నం పెట్టే స్థితి లేదు. ఈ క్రమంలో ధాన్యం సేకరించి నిల్వ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించాలి. మేం అడిగేది భారత రైతుల కోసమే.. పాకిస్తాన్‌, అమెరికా రైతుల కోసం కాదని కేసీఆర్‌ ‌చెప్పారు.

దేశాన్ని పంటల కాలనీలుగా విభజించండి. ఇది ప్రజాస్వామ్యం.. పోరాడే, అడిగే హక్కులుంటాయి. పంజాబ్‌, ‌హర్యానా మాదిరిగానే వంద శాతం కొనుగోలు చేయాలి. దేశమంతా ఒకే పాలసీ ఉండాలని కోరుతున్నాం. అట్ల చేయని పక్షంలో అనేక పోరాట రూపాల్లో ఉద్యమం చేస్తాం. అవసరమైతే కేబినెట్‌ అం‌తా వెళ్లి తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడుతాం. కిసాన్‌ ‌నాయకులు కూడా తమకు మద్దతు తెలుపుతామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదు. రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page