ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20: తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలంతా కాంగ్రెస్ కోసం ఎదురుచూస్తున్నారని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం అధికారంలో ఉన్న బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడమే ఎజెండాగా పనిచేస్తుందని బీ ఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అమలుచేసి తీరుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తుందని అన్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలను అందిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి 500 రూపాయలకే అందిస్తుందని అన్నారు గృహ జ్యోతి పథకం కింద ప్రరతి కుటుంబానికి 2 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తుందని అన్నారు యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తుందని అన్నారు రైతు భరోసా పథకం క్రింద ప్రతి ఎకరాకు ఏటా రైతులకు 15 వేల రూపాయలు కౌలు రైతులకు కూడా 15 వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తుందని అన్నారు వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల సహాయాన్ని అందిస్తుందని అన్నారు వరి పంటకు 500 రూపాయల బోనస్‌ను అందిస్తుందని చేయూత పథకం కింద వృద్ధులకు 4000 రూపాయల పింఛను అందిస్తుందని అన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల బీమాను అందిస్తుందని అన్నారు ప్రజలు కాంగ్రెస్‌పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.