తొలి ముఖ్యమంత్రిగా బిసి
అంధ• విశ్వాసాల ముఖ్యమంత్రి అసవరం లేదు
పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
హుజూరాబాద్‌తో ట్రైలర్ మాత్రమే చూపాం
కరీంనగర్ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : తెలంగాణలో బీజేపీ గెలువడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆట ముగియనుందని, మొదటిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతుందన్నారు. సోమవారం కరీంనగర్‌లో బిజెపి విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడుతూ…బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనను నిదీశారు. ప్రధాని మోదీ పదే పదే తెలుగులో మాట్లాడుతూ, తెలుగు పదాలు చెబుతూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా కేసీఆర్ కుటుంబపాలనతో ఏ లక్ష్యాలు నెరవేరలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు బదులుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాలతో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ద పన్ను తగ్గించాం. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ ద పన్ను తగ్గించలేదన్నారు.
తద్వారా ప్రజల ద భారం పడిందని, కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ఇప్పటికే పదేళ్లు గడిచిపోయాయని, వొచ్చే ఐదేళ్లు తెలంగాణ ప్రజల భవిష్యత్‌కు చాలా కీలకమన్నారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు తపన పడుతున్నారని, వారి కలలు సాకారం కావాలంటే బీజేపీకి వోటు వేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధి కోరుకుంటే కమలం గుర్తుకు వోటు వేయాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుటుంబపార్టీలు అని, వారి వల్ల కేవలం ఒకట్రెండు కుటుంబాలు బాగుపడతాయని, రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి అన్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే పీఎఫ్‌ఐ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఊతం వొస్తుందని, కనుక ప్రజలు ఆలోచించి వోటు వేసి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, అవినీతిపరులను కచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణను నాశనం చేశాయని, బీజేపీ అధికారంలోకి వొస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ తమతో దోస్తీ కోసం ప్రయత్నించారని, అందులో భాగంగా గతంలో కేసీఆర్ దిల్లీకి వచ్చి బీజేపీతో కలిసి పనిచేస్తామని అడిగినట్లు మరోసారి ప్రధాని ప్రస్తావించారు. అయితే తన కుమారుడు మంత్రి కేటీఆర్ ను తెలంగాణకు సీఎంగా చేయాలని కోరగా.. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో తమపై విమర్శలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.