సైలెంట్ మోడ్ మొదలయ్యిందన్న ఇసి
•ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం
•119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290
అభ్యర్థులు
•మొత్తం వోటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు
•రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు
వెల్లడి
•నగరంలో అమల్లోకి వొచ్చిన 144 సెక్షన్
•నేడు, రేపు నగరంలోని విద్యా సంస్థలకు
సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
•మూడ్రోజుల పాటు మద్యం దుకాణాల మూత
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. మంగళవారం నాడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత డియా ట్ నిర్వహించిన వికాస్ రాజ్ మాట్లాడుతూ..ఇక ఎలాంటి ప్రచారానికి తావులేదని తర్వాత డియా ట్ నిర్వహించిన వికాస్ రాజ్ మాట్లాడుతూ..ఇక ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు. పార్టీలు ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ‘స్థానికేతరులు నియోజకవర్గాలను వొదిలి వెళ్లాలన్నారు. సినిమాలు, సోషల్ డియాలోనూ ప్రచారం నిషిద్ధం. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ డియాలో అవకాశం ఉంది. ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు వొద్దు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం. వోటరు స్లిప్పుల్లో పార్టీల గుర్తులు, అభ్యర్థుల పేర్లు ఉండకూడదు. పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదని వికాస్ రాజ్ వెల్లడించారు. నవంబర్-30న పోలింగ్.. డిసెంబర్-3న కౌంటింగ్ జరుగనుంది. 119 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,290 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
తెలంగాణలో మొత్తం వోటర్లు 3 కోట్ల 26 లక్షలుగా ఉన్నారని, వారిలో మహిళా వోటర్లు కోటి 63 లక్షల 1,705 మంది కాగా, పురుష వోటర్లు కోటి 62 లక్షల 92 వేల 418 మంది మరియు ట్రాన్స్జెండర్లు 2,676 మంది ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు మొత్తం 35,655 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మకమైనవిగా 12 వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తొలిసారి 9 లక్షల 99 వేల 667 మంది వోటు హక్కు వినియోగించు కోనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో లక్షా నలభై వేల మంది సిబ్బందిని నియమించారు. 27,175 మంది హోమ్ వోటింగ్ ద్వారా వోటు హక్కు వినియోగించుకోనున్నారు. 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో 40 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. వోటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల కోసం 21,686 వీల్ ఛైర్లు సిద్ధం చేసిన అధికారులు, 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారని తెలిపారు. బ్రెయిలీ లిపిలోనూ వోటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు అందచేస్తున్నారు. వోటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ పక్రియను పరిశీలించనున్న 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని వికాస్ రాజు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వొచ్చిందని సీపీ సందీప్ శాండిల్య తెలపారు.
రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు….మూడ్రోజుల పాటు మద్యం దుకాణాల మూత
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈనెల 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 29,30 తేదీల్లో హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ కలెక్టర్ మంగళవారం ప్రకటించారు. తిరిగి డిసెంబర్ 1న యథావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయని వెల్లడించారు. ఇదిలావుంటే ఎన్నికల నేపథ్యంలో మూడ్రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేశారు. బార్లు కూడా బంద్ అయ్యాయి. మంగళ, బుధ, గురువారాలు వీటిని మూసేసారు. రేపు 30న పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌కు రెండ్రోజల మందు నుంచే మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రేపటి ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రలోభాలపై దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మద్యం, నగదు కట్టిడిలో చివరి రెండు రోజులు కీలకమని సీఈసీ తెలిపింది. మావోయిస్టు,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈసీఐ సూచించింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి, ఇతర అధికారులతో సక్షించింది. ఈ కాన్ఫరెన్స్‌కు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, నోడల్ ఆఫీసర్ చీఫ్ మహేష్ భగవత్, జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు హాజరయ్యారు. సీఈఓ వికాస్ రాజ్, ఆయన బృందం కూడా పాల్గొంది. మంగళవారం సాయంత్రం ప్రచార పర్వం ముగియడంతో తీసుకోవాల్సిన చర్యలపై ఇసి సూచనలు చేసింది. 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు, 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. సమస్యాత్మకంగా భావించిన 13 జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచార గడువు ముగిసింది. పోలింగ్ టైమ్ ముగియగానే సెగ్మెంట్లు ఖాళీ చేయాలని స్థానికేతరులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 119 అసెంబ్లీ కేంద్రాలు – 2290 అభ్యర్థులు, ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14వేలు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్ఎంఎస్ల ప్రసారంపై ఎన్నికల అధికారులు నిషేధం విధించారు.