వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: ప్రజాభిమానం పొందిన బిఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇటీవలే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్ రెడ్డి కి వికారాబాద్ వచ్చిన సందర్భంగా ఆలంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార గనులు భూగర్భవనురుల శాఖామంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోసారి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించి మూడవసారి ముచ్చటగా అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ అనంత్ రెడ్డి నవీన్ కుమార్ ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మహేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.