మే 6న వరంగల్లో బహిరంగ సభ, 7న ముఖ్య నేతలతో సమావేశం
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే నెలలో రెండు రోజుల పాటు రాహుల్ పర్యటించనున్నారు. మే 6న వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ 7న హైదరాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. వరంగల్ బహిరంగ సభలో రాష్ట్రంలో రైతు, వ్యవసాయ సమస్యలపై టీఆర్ఎస్ ప్రబుత్వం అనుసరిస్తున్న విధానాలపై రాహుల్ మాట్లాడతారని సమాచారం.
ఈమేరకు శనివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ గాంధీ భవన్లో సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీ పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ బహిరంగ సభకు ఎంత మందిని సమీకరించాలని, సభకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతోనే మాణిక్కం ఠాకూర్ సమావేశం నిర్వహించారు.