హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలని రీటైల్ చైన్ విస్తరణలో భాగంగా మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద నేషనల్ మార్ట్ ‘ఇండియా కా సూపర్ మార్కెట్’ ను మంత్రి శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించినట్లు నేషనల్ మార్ట్ వ్యవస్థాపకుడు యష్ అగర్వాల్ శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. కస్టమర్లకు తక్కువ దొరికే నాణ్యమైన వస్తువులను అందించాలనే నిబద్దతతో పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ముడా చైర్మన్ గంగి వెంకన్న, ఏఎంసీ చైర్మన్ రెహమాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అహ్మద్ పాల్గొన్నట్లు తెలిపారు.