తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోషించారు. లాఠీలు, ముళ్ళ కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపెట్టారు.. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫోటోలు ఎన్నో.. మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు ..తెలంగాణ ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫోటోలు రేపటికి సజీవ సాక్ష్యాలు.
ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ ప్రపంచ ఫోటగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అవార్డులు అందుకుంటున్న వారికి,.. ఆ ఘట్టాన్ని కళ్ళ నిండా చూసి, సంతోషం పంచుకునేందుకు దూరప్రాంతాల నుండి వచ్చిన కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఇంత మంచి కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్న తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలియ జేస్తూ ఒక్క అద్భుతమైన ఫోటో తీయడంలో మీరు పడే తపన, చేసే కృషి గొప్పది. .ఒక విషయాన్ని ఇతరులకు చెప్పేందుకు భాష అవసరం కానీ, ఎలాంటి బాషా అవసరం లేకుండా చిత్రం విషయాన్ని చేరవేస్తుంది..సమాజంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పది. ఒక్క ఫోటో ఒక చరిత్రను తిరగరాస్తుంది. చరిత్ర సృష్టిస్తుంది..ఉద్యమమైనా, సామాజిక విప్లవమైనా, చరిత్ర గతిని మార్చిన ఏ సంఘటనలో ఆయినా జర్నలిస్టుల పాత్ర కీలకం. .
జర్నలిస్టులు, రచయితలు చరిత్ర రాస్తారు. చరిత్ర సృష్టిస్తారు. భావి తరాలకు మార్గనిర్దేశం చేస్తారు.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోషించారు. లాఠీలు, ముళ్ళ కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపెట్టారు.. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫోటోలు ఎన్నో.. మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు ..
తెలంగాణ ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫోటోలు రేపటికి సజీవ సాక్ష్యాలు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి..నాడు జాతీయోద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి విన్నాం… నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కళ్ళ నిండా చూశాం.. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా..తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎంతో మంది జర్నలిస్టులు నాడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు..తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టులు అందరితో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది..అలాంటి మీడియాను, జర్నలిస్టును, ఫోటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నది..జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. .ఆ సమయంలో జర్నలిస్టులు అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం, కొరోనా బారిన పడిన జర్నలిస్టులకు 6 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. .మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ స్టేట్ మీడియా అకాడమీ కృషి చేస్తున్నది.
22 వేల మంది జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చికిత్స సర్జరీల కోసం 32 కోట్లు ఖర్చుపెట్టాం..రాత్రి, పగలు తేడా లేకుండా కష్ట పడతారు. కాలం తో పోటీ పడి పని చేస్తుంటారు..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని మీ ఫోటోల ద్వారా సమాజానికి తెలియజేసి ఆయా పథకాలు, కార్యక్రమాలు ద్వారా ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని కోరుకుంటున్నాను..
ఫోటో జర్నలిస్టులుగా గుర్తించాలని కోరుతున్నారు. గతంలో మీరు చెప్పాక ఒక ఏడాది అక్రిడేషన్ కార్డుపై ఫోటో జర్నలిస్ట్ అని వచ్చింది. ఆ తర్వాత నుండి మళ్ళీ ఫోటోగ్రాఫర్ అని ఇస్తున్నారు. వీటిని అల్లం నారాయణ తో మాట్లాడి పరిష్కరిస్తాం..అని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు.