హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : కోవిడ్ అనంతరం జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రధాని మోదీ పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్ పెట్టాట్టారని చెప్పారు. దేశ యువత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్లమెంట్‌లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. రెండున్నర లక్షల కోట్ల అప్పుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.