కూకట్ పల్లి ప్రజాతంత్ర, నవంబర్ 25 : కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని జగదీశ్వర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 121 కూకట్పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యమకారుడు మద్దెల రాము, 122 వివేకానంద నగర్ డివిజన్ బిఆర్ఎస్ మహిళా ఉద్యమ నాయకురాలు సంగి విజయలు పార్టీలో చేరారు. అనంతరం జగదీశ్వర్ గౌడ్ వారికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ శేరిలింగంపల్లి అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని.. ప్రజలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆని అన్నారు.