సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు సోమవారం టిఎన్జిఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత ని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికలు సిద్దిపేట జిల్లా మొత్తంలో సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా టీఎన్జీఎస్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు కౌంటింగ్ సమర్థవంతoగా నిర్వహించడంలో ఉద్యోగుల పాత్ర ఉందని ఉద్యోగులు సిద్దిపేట జిల్లాలో సమర్థవంతంగా పనిచేసే సిద్దిపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ ఏ చిన్న ఫిర్యాదులు లేకుండా సమర్థవంతంగా పనిచేశారని అందరూ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మరెన్నో ఎన్నికలు నిర్వహించాలని దీనికి ఉద్యోగస్తులు అందరూ సిద్ధంగా ఉండాలని భవిష్యత్తు ఎన్నికలు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నారని తెలియజేశారు. టీఎన్జీవోస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగిందని దీనికి కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు రిటర్నింగ్ ఆఫీసర్స్ తో పాటు అందరూ ఉద్యోగులు కూడా పాటించారని దీనివల్ల సిద్దిపేటలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బ్రహ్మాండంగా ఎలక్షన్లు నిర్వహించారని దీనికి తోడ్పడినటువంటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత కి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ కి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్లకు ముఖ్యంగా ఉద్యోగులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఎన్నికలు నిర్వహించుకోబోతున్నామని అవన్నీ కూడా సజావుగా ఐక్యతతో సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, నగేష్ ,సుమన్, సాయి, శ్రీధర్, ఉపేందర్, శ్రీకాంత్, తదితర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.