పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 10: సులభతర వాణిజ్య విధానం ప్రవేశపెట్టి తెలంగాణ పారిశ్రామిక రంగంలో నవ షకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు లో ఏర్పాటుచేసిన తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక రంగం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను ఇటు కార్మికులు అటు పరిశ్రమల యజమాన్యాల సమస్యల పై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్ చెరు లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. టీ ఎస్ ఐఐసి ద్వారా చిన్న తరహా పరిశ్రమ యజమాన్యాలకు స్థలాలు అందించి నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నావా తెలిపారు. పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న బిఆర్ఎస్ పార్టీకి అండదండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్ పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పరిశ్రమల సంఘం ప్రతినిధులు గోపాలరావు, ఆనందరెడ్డి, అమరేందర్ రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఐలా అధ్యక్షులు రమేష్, మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బసిరెడ్డి చంద్ర శేకర్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.