తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం

  • హైవేల శంకుస్థాపన ట్రైలర్‌ ‌మాత్రమే
  • అమెరికా తరహాలో అభివృద్ధికి చర్యలు
  • జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ
  • తెలంగాణ గేమ్‌ ‌చేంజర్‌గా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు : కేంద్ర యంత్రి కిషన్‌ ‌రెడ్డి

రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ ‌నినాదాలు…పార్టీ శ్రేణులను వారించిన కిషన్‌ ‌రెడ్డి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ‌తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం అని కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ అన్నారు. అభివృద్ధికి నీరు, పవర్‌ ‌రవాణా, ట్రాన్స్ ‌ఫోర్ట్, ‌కమ్యూనికేషన్‌ అవసరమన్నారు. హైవేల శంకుస్థాపన కేవలం ట్రైలర్‌ ‌మాత్రమేనని, ముందు ముందు యూఎస్‌ ‌స్టాండర్డ్‌లో  హైవేలు ఉంటాయన్నారు.  26 గ్రీన్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవేల్లో హైదరాబాద్‌ ‌నుంచే 5 ఉన్నాయన్నారు. 32 జిల్లాల్లో హైవే కనెక్టివిటీ ఉందన్నారు. హైదరాబాద్‌ ‌రింగ్‌ ‌రోడ్డు కోసం మంజూరుకు అనుమతిచ్చామన్నారు. మూడు నెలల్లో రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ శంఖుస్థాపనకు వొస్తానన్నారు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ జాతికి అంకితం చేశారు.

శుక్రవారం రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ రూ.7,853కోట్ల విలువ చేసే జాతీయ రహదారులకు శంకుస్థాపన,  ప్రారంభోత్సవం చేశారు. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా… 2 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. దాదాపు 258 కిలో వి•టర్ల జాతీయ రహదారుల విస్తరణకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. 12 హైవేల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఏడు సీఆర్‌ఐఎఫ్‌ ‌ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి..ఇప్పటికే పూర్తయిన 96 కి.వి•ల పొడవైన జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. జీఎంఆర్‌ ఎరీనా వద్ద హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి.. అనంతరం ఇప్పటికే పూర్తయిన రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు.

ఏడు సీఆర్‌ఐఎఫ్‌ ‌ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాంసాన్‌ ‌పల్లి నుంచి మంగళూరు వరకు 4 వరుసల రహదారిని జాతికి అంకితమిచ్చారు. రూ.8,000 కోట్లకు పైగా వ్యయంతో 460కి.వి• మేర 12 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 96 కి.వి•ల రహదారి పనులు పూర్తయ్యాయి. రూ.1,614 కోట్లతో 47కి.వి• మేర 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. రూ.4,927 కోట్లతో చేపట్టే.. 258 కి.వి•. హైవేల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారుల ముఖచిత్రం మార్చివేసిన ఘనత డైనమిక్‌ ‌మినిస్టర్‌ ‌నితిన్‌ ‌గడ్కరీదేనని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ గేమ్‌ ‌చేజంర్‌గా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు ఉండబోతుందన్నారు. రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణం పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ ముందుంటుంద న్నారు. మోదీ హాయాంలో తెలంగాణలో 4,996కివి• జాతీయ రహదారులు నిర్మించామన్నారు కిషన్‌ ‌రెడ్డి.

శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  తెలంగాణ ప్రగతికి జాతీయ రహదారులు కీలకమని కేంద్ర రహదారుల సహాయమంత్రి వీకే సింగ్‌ ‌పేర్కొన్నారు. నితిన్‌ ‌గడ్కరీ చొరవతోనే తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ రహదారుల నిర్మాణం కోసం కిషన్‌ ‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. తెలంగాణలో పెండింగ్‌ ‌ప్రాజక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని వీకే సింగ్‌ ‌వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, రాములు, బీబీ పాటిల్‌, ‌రంజిత్‌  ‌రెడ్డి, పసునూరి దయాకర్‌, ‌మన్నె శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.

రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ ‌నినాదాలు… పార్టీ శ్రేణులను వారించిన కిషన్‌ ‌రెడ్డి
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగానికి ఆటంకం కలిగింది. ప్రశాంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా భాజపా శ్రేణులు జై శ్రీరామ్‌ ‌నినాదాలు చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేయడంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని కార్యకర్తలను వారించారు. అధికారిక కార్యక్రమంలో నినాదాలు వద్దని భాజపా శ్రేణులను ఆయన కోరారు. అయినా వారు ఆపక పోవడంతో నినాదాల మధ్యనే మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page