పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలో శనివారం పటాన్ చెరులో బసవేశ్వర విగ్రహం నుండి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ… భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ మాత్రం నైజాం పరిపాలనలో ఉన్నది. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సెప్టెంబర్ 17 1948లో తెలంగాణకు విమోచనం లభించిందనీ, రజాకర్లు లొంగిపోయి తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన రోజు సెప్టెంబర్ 17 కాబట్టి మలీ దశ ఉద్యమంలో నేటి ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రోశయ్య పైన కిరణ్ కుమార్ రెడ్డి లపైన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణలోఅధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ కోసం విద్యార్థులు అమరులై ప్రాణ త్యాగాలు సబ్బండవర్గాల అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సీమాంధ్ర పాలకుల పెత్తనంలో ఉన్న తెలంగాణలో అధికారికంగా నిర్వహించలేకపోయారు కానీ తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన మీరు అధికారంలో ఉండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేవలం ఎంఐఎం పార్టీకి భయపడి జరపకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యాలయ కార్యదర్శి బిల్లే రవి, పట్టణ అధ్యక్షులు నాగరాజు యాదవ్, అమీన్ పూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఆగారెడ్డి, జిన్నారం మండల అధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంగడి బాలరాజు, సీనియర్ నాయకులు ఏం రామ్మోహన్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ రాజగోపాల్, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ హెచ్ సంగమేష్, జిన్నారం మండల కోశాధికారి వీరేశం చారి, ప్రధాన కార్యదర్శి అనిల్, సీనియర్ నాయకులు విజయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదిత్య, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.