హైదరాబాద్ ,సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినం ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది .కేంద్ర మంత్రి జీ .కిషన్ రెడ్డి ఇదే అంశంపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు సమాచారం .పొరుగు రాష్ట్రాలయిన మహారాస్ష్ట్ర ,కర్ ణాటక ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది .