తేజస్​ మిథున్​రెడ్డి మృతికి కారకులయి వారిపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్​అభిషేక్​ అగస్త్య

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఉన్న విష్ణుప్రియనగర్​లో మున్సిపల్​ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వరద నీటిని దారి మల్లించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాలా పై కప్పు తెరిచి ఉంచడంతో నాలుగేళ్ళ బాలుడు తేజస్​ మిథున్​రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్​ అభిషేక్​ అగస్త్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విష్ణుప్రియనగర్​లోని తుర్క చెరువుకు అనుసంధానంగా ఉన్న నాలా పైకప్పును ఈనెల 5వ తేదీన వరద ఉదృత్తిని మళ్ళించేందుకు తెరిచి ఉంచడం వల్లే పైకప్పు దాటేందుకు తేజస్​ మిథున్​ రెడ్డి వెళ్ళగా అక్కడ నాలా తెరిచి ఉండటం వల్ల అందులో కొట్టుకుపోయి బాలుడు మృతి చెందారని అధికారులు, బాలుని తల్లిదండ్రులు తెలిపిన మేరకు అందుకు సంబంధించిన బాధ్యులను గుర్తించి పట్టుకొని వారిపై, అపార్టుమెంట్​పై కేసు నమోదు చేయాల్సిందిగా ఎఫ్​ఐఆర్​ చేయాల్సిందిగా బాచుపల్లి స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ (ఎస్​హెచ్​వో)కు జిల్లా అదనపు కలెక్టర్​ అభిషేక్​ అగస్త్య ఆదేశించారు.  ఈ విషయంలో మృతుడు నాలుగేళ్ళ తేజస్​ మిథున్​రెడ్డి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు తన సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page