ప్రభుత్వం పైనే నిరాశా జీవుల ఆశలు
ప్రపంచాన్ని అతలాకుతలం గావించిన కరోనా మహమ్మారి ప్రభావం 200 పై చిలుకు దేశాలలో ఉన్నా గల్ఫ్ కార్మికుల పైన తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గ తుల్యమై ఉంది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితులకు, గల్ఫ్ దేశాలు మినహాయింపు లేకుండా ఉన్నాయి. ఇదివరకే కారణాంతరాల వల్ల కొన్ని దేశాలలో, వాణిజ్య పర లావాదేవీలకు అడ్డుకట్ట వేయబడి, ఆర్థిక వ్యవస్థలో, అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుండగా, చెప్పా చేయక మీద పడిన కరోనా ప్రభావ కారణంగా, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతున్నది. సదరు కారణాలవల్ల ఇప్పటికీ, అక్కడ స్థానిక ప్రభుత్వ అనుమతి కారణంగా, కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసివేయగా మరికొన్ని తమ ఉద్యోగుల జీవితాలలో 30 శాతం 50 శాతం కోతలు విధిస్తున్నాయి. ఉద్యోగాలు పూర్తిగా కోల్పోయి స్వదేశాలకు తిరిగి రాక తప్పని స్థితులలో, భారత ప్రభుత్వానికి తమ గోడు వినిపించిన వేళ… దేశ పరిస్థితి మెరుగు పడ్డాక తగిన ఏర్పాట్లు చేసే అవకాశం ఉందంటూ, ప్రధాని మోదీ వారిని సాంత్వన పరిచి, చొరవ తీసుకొని, అక్కడి భారతీయ వ్యాపార సంస్థలతో మాట్లాడిన ఫలితంగా, ఎక్కడికక్కడే క్వరంటెన్ సెంటర్లు ఏర్పాటు చేసి, వారిని సురక్షితంగా ఉంచడం జరిగింది. స్వస్థలాలకు చెందిన స్వచ్ఛంద సేవకులు, మానవతా దృక్పథంతో, అవసరమైన వారికి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేశారు. ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే క్రమంలో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం కొన్ని బ్యాంకులకు ప్రభుత్వపరంగా నిధులు అందించడం జరిగింది.
ఇదిలా ఉంటే….. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఒమాన్, బెహరాన్ ఆరు దేశాలలో ప్రస్తుతం 87 లక్షల 24 వేల 829 మంది ప్రవాస భారతీయులు ఉన్నారని పార్లమెంటులో భారత ప్రభుత్వం పక్షాన, ఒక ప్రశ్నకు సమాధానంగా, అధికారిక లెక్కలను ఇదివరకే ప్రకటించింది. వీరిలో 17 శాతం అంటే 14,90,019 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు ఒక అంచనా. సంక్షోభం ముదిరి పాకాన పడుతున్న వేళ…. గల్ఫ్ దేశాల లోని తెలంగాణ ప్రాంతీయులలో 25 శాతం, అంటే 3,72,503 మంది ఉద్యోగాలు దశలవారీగా కోల్పోతూ, ఆరుమాసాల వ్యవధిలో, స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు మంద భీమ్ రెడ్డి సమన్వయకర్తగా, ఎమ్మిగంటి వెల్ఫేర్ ఫోరం మరియు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, సంయుక్తంగా జరిపిన సర్వే వల్ల స్పష్టం అయింది. ఒక గల్ఫ్ కార్మికుడు సరాసరి దాదాపు 700 ధరంస్ / రియాల్స్ అంటే 14 వేల రూపాయలను నెలనెలా ఇంటికి పంపిస్తున్నారని అనుకుంటే, 3.70 లక్షల మంది సంవత్సరానికి 6, 250 కోట్ల సంపాదన కోల్పోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీని ప్రభావం తెలంగాణ ప్రభుత్వం పైనా తీవ్రంగా ఉంటున్నది.. వాస్తవానికి అరబ్ గల్ఫ్ దేశాలు… సౌదీ, యూఏఈ, ఒమాన్, బెహరాన్, కువైట్, ఖతార్ తదితర దేశాలలో తెలంగాణ కార్మికులు, జీవనోపాధి కోసం వలస వెళ్లగా, వారిపై ఆధారపడిన కుటుంబాలలో దాదాపు 40 లక్షలకు పైగా ఓటర్లు, 25 శాసనసభ నియోజక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. బొంబాయి – దుబాయ్ బొగ్గుబాయి… నినాదంతో తెలంగాణ – వలస కార్మికుల స్థితి గతుల గురించి, ఉద్యమ సమయంలో పదేపదే వల్లించిన తెరాస నేతలు, అధికారంలోకి వచ్చాక, ఆ విషయమే మరిచారు. తెలంగాణ తొలి తెరాస ప్రభుత్వం 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి, ఒత్తిళ్ల అనంతరం 100 కోట్లు కేటాయించినా, సదరు నిధులను ఖర్చు చేయని అంశాన్ని, కార్మికుల కుటుంబాలు ప్రతిపక్షాలు పదేపదే గుర్తు చేస్తూనే ఉన్నాయి.
తెలంగాణ కార్మికులు ప్రతినెల పదిహేను వందల కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని, మాతృ దేశానికి పంపిస్తూ, దేశ, రాష్ట్ర అభివృద్ధికి చేయూతను, అందిస్తూ ఉన్నట్లు విశ్లేషకులు పదే పదే చెబుతూనే ఉన్నారు. గల్ఫ్ ఎన్.ఆర్.ఐ ల ద్వారా 18000 కోట్ల ధనం తెలంగాణకు వస్తుండగా పరోక్షంగా. ఐదు/ఆరు శాతం స్థానిక పన్నుల రూపే ణ ఏటా 1000 కోట్ల ఆదాయం పొందడం జరుగు తున్నది. తెరాస ఇటీవలి, మలి సాధారణ శాసనసభ ఎన్నికలలో, తమ వాగ్దానంగా, గెలిచాక గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. గల్ఫ్ లో రాచరిక పాలన నేపథ్యంలో, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం. అందుకే గల్ఫ్ కార్మికుల సమస్యల అట్ల అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే వేయలేదు. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల స్థానీకరణ, కంపెనీల దివా లాలు, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో ఆధిపత్య పోరు, అంతర్గత ఉద్యమాలు, యుద్ధ వాతావరణం కలగలిపిన నేపథ్యంలో, తెలంగాణ ప్రాంతీయులకు, ఉద్యోగ భద్రత పూర్తిగా కరువైంది. గల్ఫ్ దేశాల నుండి విధిలేని పరిస్థితు లలో, ఉపాధి కోల్పోయి, తిరిగి రానున్న కార్మి కులకు, తెలంగాణ ప్రభుత్వం పునరావాసం, పునరేకీ కరణ, (రీ ఇంటిగ్రేషన్, రీ సెటిల్మెంట్, రిహ్యాబిలి టేషన్) పథకాలను ఏర్పరచి, కేరళ ప్రభుత్వ తరహాలో, ప్రత్యేక విభాగాన్ని, గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, ఏర్పాటు చేయాలని, ఇతర దేశాలలో అనుభవం గడించి వచ్చిన, నైపుణ్యం, సా ర్థ్యం కలిగిన కార్మికుల సేవలు వినియోగించు కోవాలని, ఎమ్మిగ్రెంట్స్ వెగ్నేక్ ఫోరం అధ్యక్షులు మంద భీం రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494