పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: దళితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.పటాన్ చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ 111, 112 డివిజన్ పరిధిలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని గురువారం రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… అధికార పార్టీకి చెందిన దళితులకు మాత్రమే దళిత బంధు పథకానికి ఎంపిక చేయడం సరైంది కాదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించే వరకు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ వడ్డె కృష్ణ, నర్సింగ్ రావు, సుధాకర్ గౌడ్, అశోక్ ముదిరాజ్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, వినోద్, ట్రెజరర్ జగన్, జనరల్ సెక్రటరీలు సామ్రాట్, నాగేష్, పాషా, శంకర్, హరీష్ కుమార్, గిరి, మాజీ అధ్యక్షుడు వీరారెడ్డి, శ్యామ్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కెఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.