దళితులపై రఘునందన్ రావు కు చిన్నచూపు

పార్టీలో పనిచేసినప్పటికీ ఫోటోలతో గవర్నర్ కు ఫిర్యాదు చేయడం సరికాదు.
కంప్లైంట్ వెంటనే వాపసు తీసుకోవాలి
-దళిత,మైనార్టీ,బీసీ సంఘాల నాయకులు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఒక గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్రస్థాయికి ఓ దళితుడు ఎదగడం ఓర్వలేకే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బక్కి వెంకటయ్య పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిషన్ డిస్టిక్ మెంబర్ భీమసేన ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత, మైనారిటీ సంఘాల నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి బక్కి వెంకటయ్య చేసిన సేవలను గుర్తించే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆయన పార్టీలో పని చేసినప్పటి ఫోటోలు తీసుకువెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. బిజెపి పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావుకు మొదటి నుంచి దళితులంటే చిన్నచూపే ఉంటుందన్నారు. రఘునందన్ రావు గవర్నర్ వద్ద ఆరోపించినట్టుగా బక్కి వెంకటయ్య ఏ సభలో కానీ వేదికపై కానీ టిఆర్ఎస్ పార్టీకి గాని, ప్రభాకర్ రెడ్డికి కానీ ఓటు వేయాలన్నట్లుగా ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రఘునందన్ రావు తన వైఖరి మార్చుకుని కంప్లైంట్ వాపసు తీసుకోవాలని, లేనిపక్షంలో దళిత మైనారిటీ బీసీ సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత , మైనార్టీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు జెల్లే రాములు, కలిముద్దిన్, గుట్టి సత్యనారాయణ, మెట్ పల్లి నరసింహ, చంద్ర కాంత్ , కొదాడి శ్రీనివాస్, దార స్వామి, కత్తి రాజేందర్, జక్కుల రాజు, కొమ్మేటి రాజు, ఆస బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page