దిల్లీలో దీక్షకు నేను సిద్ధం..కెసిఆర్‌ సిద్ధమా

కెటిఆర్‌, హరీష్‌ రావుల ప్రశ్నకు సిఎం రేవంత్‌ సమాధానం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు అన్యాయంపై నిరసనగా, రాష్ట్ర ప్రయోజనాల కొరకు బిఆర్‌ఎస్‌ అధినేత కలిసి వొస్తే తానూ సిద్ధమని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి నిధుల కోసం దిల్లీలో దీక్ష చేయాలని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌ రెడ్డిని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావు చేసిన డిమాండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ వొస్తే.. ప్రభుత్వాధినేతగా తాను వొస్తానని చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్‌ ముందుకు రావాలన్నారు.

వారే తారీఖు డిసైడ్‌ చేసినా తాము సిద్ధమన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చుడో..సచ్చుడో తేల్చుకుందామని రేవంత్‌ బిఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని తామెప్పుడూ పదే పదే చెప్పలేదని కెసిఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ విమర్శలు గుప్యించారు. రూ.100 పెట్టి పెట్రోల్‌ కొన్నారు కానీ, అగ్గిపెట్టి కొనలేదని, అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదని హరీష్‌ రావుకు రేవంత్‌రెడ్డి చురకలంటించారు. కేంద్ర బ్జడెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై బుధవారం శాసనసభలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సరైన విధానాన్ని పాటించలేదని బిఆర్‌ఎస్‌ సభ్యులు విమర్శించారు. అనంతరం తీర్మానంపై తన అభిప్రాయాన్ని వినిపించారు.

ts news live, union budjet 2024, revanth reddy, congress party, BRS, kcr, ts assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page