సిబిఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల కస్టడీకి
రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు
న్యూ దిల్లీ, అక్టోబర్ 13 : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్?పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎంకే నాగ్?పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం విధించిన 3 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ ఆయనను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అభిషేక్ సీబీఐ కస్టడీని పొడగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీలో అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. అందుకే ఆయన కస్టడీ మరో రెండు రోజులు పొడగించాలని అధికారులు కోర్టును అభ్యర్థించారు. అయితే అభిషేక్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీ పొడగింపు పిటిషన్?ను వ్యతిరేకించారు. రెండ్రోలుగా సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని అందుకే కస్టడీ పొడగించవద్దని, దర్యాప్తునకు అభిషేక్ పూర్తిగా సహకరిస్తారని న్యాయమూర్తికి విన్నవించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి సీబీఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్‌పల్లి మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపధ్యంలో అధికారులు ఆయనను రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అభిషేక్ సీబీఐ కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడగించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. మూడు రోజుల కస్టడీలో అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని కోర్టుకు విన్నవించరా. అందుకే ఆయన కస్టడీ మరో రెండు రోజులు పొడగించాలని అధికారులు కోర్టును అభ్యర్థించారు. మరోవైపు అరుణ్ పిల్ళైతో అభిషేక్‌కు సంబంధాలున్నాయని, వీరిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణకు హాజరుకావాలని అరుణ్ పిళ్లై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోకు నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన కూతురు హాస్పిటల్ లో అడ్మిట్ అయినందున విచారణకు హాజరుకాలేదని చెప్పారు.
ఇదే కేసుకు సంబంధించి ముత్తా గౌతమ్ ను సైతం ప్రశ్నిస్తున్నట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే అభిషేక్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీ పొడగించాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి విన్నవించారు. రెండ్రోలుగా సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ జరపనందున కస్టడీ పొడగించవద్దని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ అభిషేక్ బోయిన్‌పల్లిని సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు. అదే రోజు కోర్టు ఎదుట హాజరుపరచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ లోకి రూ.3.85కోట్లు వచ్చినట్లు గుర్తించామని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆ నగదు బదిలీకి సంబంధించి ఆయన ఎలాంటి పత్రాలు చూపలేదని చెప్పింది. రెండు మూడు ఖాతాల నుంచి వచ్చిన డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాడని, ఆయనకు ఆ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని విన్నవించింది. లిక్కర్ పాలసీ విషయంలోనూ అభిషేక్ వివిధ ప్రాంతాల్లో జరిగిన టింగ్ లకు హాజరైన విషయాన్ని సీబీఐ ప్రస్తావించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అభిషేక్ ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించాలని కోరింది. సీబీఐ వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ కే నాగ్ పాల్ ఆయనను అక్టోబర్ 12 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.