కొరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
న్యూ దిల్లీ, జూన్ 20 : దేశంలో కొరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజుకు 12 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. సోమవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కొరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76వేలు దాటాయి. ప్రస్తుతం రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతం ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 4,33,09,473 చేరింది. ఇందులో 4,27,07,900 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 76,700 యాక్టివ్ కేసులుండగా.. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5,24,873 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 196,18,66,707 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
కొరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి స్మ•తి ఇరానీ
కేంద్రమంత్రి స్మ•తి ఇరాని కొరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దిల్లీలోని రాజేంద్రనగర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానన్న మంత్రి.. తనకు కొరోనా పాజిటివ్‌గా తేలిందని అందులో తెలిపారు. రాజేంద్రనగర్ ప్రజలు రాజేష్ భాటియాకు వోటు వేసి బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా అమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమె ఐసోలేషన్‌లో ఉన్నారు. స్మ•తి ఇరాని కొరోనా బారిన పడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు అమె 2020లో కొరోనా బారినపడ్డారు.