తాజాగా 12,213 మందికి పాజిటివ్
న్యూ దిల్లీ, జూన్ 16 : దేశంలో కొరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వొస్తున్నది. తాజాగా గురువారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్ బారినపడ్డారు. బుధవారంతో పోలిస్తే 38శాతం ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తరువాత ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం దేశంలో నాలుగో వేవ్ ప్రారంభమైందా అనే అనుమానాలు రేకేత్తిస్తుంది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 12 వేలు దాటింది. ఇక యాక్టివ్ కేసులు కూడా 60 వేలకు చేరువయ్యాయి.
రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మొత్త బాధితులు 4,32,57,730కి చేరారు. ఇందులో 4,26,74,712 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,803 మంది మరణించారు. మరో 58,215 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, కొత్తగా 11 మంది కొరోనాతో మృతిచెందగా, 7624 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఈ దఫా కూడా మహారాష్ట్ర కొరోనా కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో బాధితులు నమోదవుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 4,024 కేసులు మరఠ్వాడాలోనే ఉన్నాయి. ఇక కేరళలో 3488, ఢిల్లీలో 1378, కర్ణాటకలో 648, హర్యానాలో 596, తమిళనాడులో 476 చొప్పున మోదయ్యాయి. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరుకున్నది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.13 శాతానికి చేరాయి. రికరీరేటు 98.65 శాతంగా, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,67,37,014 టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.