దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం

  • దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం
  • ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందుకు
  • త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
  • ‌సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన
  • ప్రజల రక్షణకు పోలీస్‌ ఔట్‌ ‌పోస్టులో 24/7 సేవలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌దేశంలోనే పేద ప్రజలకు గృహా సముదాయం కేవలం సిద్ధిపేటలోనే ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. సోమవారం సిద్ధిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్‌(‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు)లోని ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ ఔట్‌ ‌పోస్టును ప్రారంభించడంతో పాటు 33/11కెవి విద్యుత్‌ ఉప కేంద్రం నిర్మాణ పనులకు, కేసీఆర్‌ ‌నగర్‌-‌గుండ్ల చెరువులకు లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంక్‌, ‌కంపౌండ్‌ ‌వాల్‌ ‌నిర్మాణ పనులకు ల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణశర్మ, పోలీస్‌ ‌కమిషనర్‌ ‌నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నర్సింగ్‌ ‌కౌన్సిలింగ్‌ ‌సభ్యుడు పాల సాయిరాం, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..ఆదర్శవంతమైన చక్కటి కాలనీ నిర్మించి ఒక్కొక్కటిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామనీ, 2450 ఇండ్ల కాలనీ తక్కువ సమయంలో తీర్చిదిద్దుకోవడం చాలా సంతోషంగా ఉందిదన్నారు. కాలనీ ఏర్పాటయ్యాక అంగన్‌వాడీ, రేషన్‌ ‌షాపు, పాఠశాల, నీటి ట్యాంక్‌లతో పాటు అదనంగా లక్షా 50 వేల లీటర్ల మూడవ నీటి ట్యాంక్‌ ‌పనులు ప్రారంభం చేసుకున్నామని తెలిపారు.

కరెంటు లోఓల్టేజీ కారణంగా రూ.5.42 కోట్లతో 33/11కెవి విద్యుత్‌ ‌సబ్‌ ‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇది 7వ సబ్‌ ‌స్టేషన్‌, ‌నియోజకవర్గంలో 44వ సబ్‌ ‌స్టేషన్‌ అని, తెలంగాణ రాష్ట్రం రాకముందు 20 సబ్‌ ‌స్టేషన్లు ఉండేవీ కావనీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో ఇవన్నీ వచ్చాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ‌నగర్‌ ‌లో లబ్ధి పొందిన లబ్ధిదారులు ఇళ్ళు కిరాయి ఇస్తే, తాళం వేస్తే ఇళ్లు వాపస్‌ ‌తీసుకుంటామని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. మరో వెయ్యి ఇండ్ల నిర్మాణం ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. ఎల్‌అం‌డ్‌టి శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగం సైతం ఇప్పిస్తామని తెలిపారు. త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌జారీ చేయనున్నామని పేర్కొన్నారు. క్రమ శిక్షణ కలిగిన కాలనీగా పెద్దలు సహకరించాలని కేసీఆర్‌ ‌నగర్‌ ‌కాలనీ వాసులను కోరారు. నర్సాపూర్‌ ‌కేసీఆర్‌ ‌నగర్‌లో పోలీసు అవుట్‌ ‌పోస్ట్‌తో ఇక్కడి ప్రజలకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. పోలీస్‌ ‌కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రజల రక్షణకు అవుట్‌ ‌పోస్టులో 24/7 సేవలు అందించడం జరుగుతుందన్నారు, కేసీఆర్‌నగర్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే ఔట్‌ ‌పోస్ట్‌కు వెళ్లి చెప్పుకుంటే పోలీసులు వెంటనే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. కేసీఆర్‌నగర్‌ ‌లో ఉన్న వివిధ రకాల మతాలకు కులాలకు చెందిన ప్రజలు ఉన్నందున ప్రతి రోజూ కౌన్సెలింగ్‌ ‌నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ప్రజల ధనమాన రక్షణ గురించి ఔట్‌ ‌పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

300మంది లబ్ధిదారులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల పట్టాల పంపిణీ…అర్హులైన 72 మంది జర్నలిస్టులకూ ఇండ్లు
జిల్లా కేంద్రమైన రెడ్డి సంక్షేమ భవన్‌లో పట్టణంలోని 300 మంది లబ్ధిదారులకు డబుల్‌ ‌బెడ్‌ ఇం‌డ్ల పట్టాలను మంత్రి హరీష్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…పేద ప్రజల కోసం సిఎం కేసీఆర్‌ ‌రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు కట్టిస్తున్నాడన్నారు. 300మందికి ఇవాళ పట్టాలు పంపిణీ చేస్తున్నామనీ, త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహ ప్రవేశాలు చేసుకుందామన్నారు. ప్రతీ ఇళ్లు సుమారు 20లక్షల రూపాయిలు విలువ కలిగినవనీ, ఇవీ ఎవరూ అమ్మకూడదదనీ, కిరాయిలకు ఇవ్వొద్దనీ, అమ్మినా, కిరాయిలకు ఇచ్చినా తిరిగి వాపస్‌ ‌తీసుకుంటాంమన్నారు. త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామనీ, గతంలో లబ్ధి పొందని అక్రిడిటేషన్‌ ‌కార్డు కలిగిన జర్నలిస్టులకు మూడు బ్లాకులలో 72 మంది జర్నలిస్టులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కేటాయింపు చేస్తామన్నారు. అర్హులైన దళిత జర్నలిస్టులకు దళితబంధు పథకంలో అవకాశం కల్పిస్తామన్నారు. స్వంత స్థలం ఉన్న వారికి ఇంటి అడుగు జాగలో ఇల్లు కట్టుకోవడానికి త్వరలోనే సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌సిహెచ్‌.‌రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు రాధాకృష్ణశర్మ, కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, జంగిటి కనకరాజు, కొండం సంపత్‌రెడ్డి, పూజల వెంకటేశ్వర్‌(‌చిన్న)ధర్మవరం బ్రహ్మం, బర్ల మల్లిఖార్జున్‌, ఎడ్ల అరవింద్‌రెడ్డి, సుందర్‌, ‌గ్యాదరి రవి, కలకుంట్ల మల్లిఖార్జున్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

కమర్షియల్‌ ‌షాపింగ్‌ ‌కాంప్లెక్స్ ‌ప్రారంభం…
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సుడా కార్యాలయ ఆవరణలో 39 లక్షల రూపాయలతో నిర్మించిన 4 కమర్షియల్‌ ‌షాపింగ్‌ ‌కాంప్లెక్స్ ‌దుకాణ సముదాయాలను రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా లబ్ధిదారులు మంత్రికి హృదయ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page