మన్యం దొరగా, విప్లవజ్యోతిగా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోది జూలై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా.. ప్రత్యేక వ్యాసంఊ భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. అల్లూరి సీతారామరాజు జన్మదినం జూలై 4, 1897. 125వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. అయన ధైర్యసాహసాలకు, త్యాగనిరతికి శిరసు వంచి నమస్కరిద్దాం. దేశభక్తిలో ఆయనకు వారసులవుదాం.
అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న వెంకట రామరాజు-సూర్యనారాయణమ్మ దంపతులకు నాటి కృష్ణా జిల్లాలోని భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామంలో జన్మించాడు. రాజమండ్రి, నర్సాపురం, కాకినాడలో నాలుగో ఫారం వరకు చదువుకున్నాడు . అతి చిన్నవయసులో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహ స్వప్నంగా నిలిచిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమంలో ఓ అధ్యాయం.స్వాతంత్య్రం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే అని నమ్మిన అల్లూరి 27 ఏళ్ళకే స్వతంత్రం కోసం అమరుడయ్యాడు. ప్రజాదృష్టిలో దైవసమానుడై, ప్రభుత్వదృష్టిలో రాజద్రోహిగా యెంచబడినవాడు. మన్యప్రజలను సమీకరించి అతి స్వల్పమైన దళంతో ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడు రామరాజు.
‘‘విప్లవం నా జన్మహక్కు’’ అని తెలుగు గడ్డపై గర్జించిన వీరుడు. గురి తప్పిన అధికారికి గుండెలు చూపి కాల్చ మన్న వీరాధి వీరుడు రామరాజు. దేశంకోసం ప్రాణాలర్పించిన రామరాజు చరిత్ర అమరచరిత్రగా నిలిచి పోతుంది. భారత స్వాతంత్రోధ్యమం చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు మహొజ్వలఘట్టం.
అల్లూరి సీతారామరాజు ఈ పేరు చెప్పాగానే రోమాలు నిక్కబోడుస్తాయి. కారణం అల్లూరి ఒక మహోజ్వల శక్తి. సీతారామరాజు నమ్మిన సిద్దాంతం ప్రాణాలర్పించైన పోరాటం ద్వారానే స్వతంత్రం తీసుకురావలనుకున్నడు. చివరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో చాలా పేదరికం అనుభవించాడు. సీతారా మరాజుకు చదువుపై ఇష్టం లేకపోవడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి పలికాడు.
తర్వాత వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. కొద్ది రోజులు తునిలో కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ నిత్యం దైవ పూజ చేస్తూ గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు.ఆ తర్వాత కొంతకాలానికి ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. ఆ తర్వాత రెందవ యాత్ర బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రాంతాలలో సంచరించాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన రామరాజు ఆనాడు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనుల ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషు అధికారులపై విరుచుకుపడ్డాడు.
ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పట్టణాలలోనే కాకుండా ఏజన్సీ ప్రాంతాలలో వారి దురాగాతలకు అంతు అడ్డు ఉండేది కాదు. వారి చేతిలో అమాయకమైన గిరిజనులు దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణంగా గురి అయ్యేవారు. ఈ దురాగతాలను సహిం చలేక రాజు మన్యం ప్రజలో తిరుగుబాటు తీసుకురావాలని గిరిజ నులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని నిర్ణయి ంచుకున్నాడు. అలా కొద్ది రోజుల్లోనే మన్యం ప్రజలకు అన్ని యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని ఒక సైన్యంగా తాయారు చేశాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.
గిరిజనుల కష్టాలను కడతేర్చేందుకు నడుంబిగించిన రామరాజు వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యం నూరిపోసి తెల్లదొరను ఎదిరించే స్థాయికి వారిని చైతన్య పరిచాడు. తమకు అండగా నిలిచిన అల్లూరిపై గిరిజనులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి తమ నాయకునిగా స్వీకరించారు. సీతారామరాజు 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలుపెట్టి విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు.సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘనల్లో బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ వారిని ఎదిరించలేకపోయారు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు.
ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు నిశ్శబ్దం పాటించటంతో ఆయన మరణించాడనే పుకార్లు వ్యాపించాయి. అయితే సీతారామరాజు 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అయితే విప్లవాన్ని అణచివేసే కార్యక్రమంలో బ్రిటిషు అధికారులు, పోలీసులు ప్రజలను భయక ంపితులను చేయటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా లొంగిపోవాలని నిశ్చయిం చుకున్నాడు. తను నది ఒడ్డున ఉన్నానంటూ బ్రిటిషర్లకు సమాచారం ఇచ్చి పంపాడు. నేరుగా వచ్చిన బ్రిటిషర్లు 1924 మే 7న ఏటి ఒడ్డున స్నానమాచరిస్తున్న అల్లూరిని పోలీసులు బంధించారు. ఎటువంటి విచారణ చేపట్టకుండానే సీతారా మరాజును అదే రోజున కాల్చి చంపారు. అలా స్వాత ంత్య్రం కోసం తన ప్రాణాలను అర్పించి అమరవీ రుడయ్యాడు అల్లూరి సీతారామరాజు.
అల్లూరి పేరిట జిల్లా ఏర్పాటు చేయాలన్న కల వై ఎస్ జగన్మోహన్రెడ్డిముఖ్యమంత్రి
– నందిరాజు రాధాకృష్ణ. సీనియర్ జర్నలిస్ట్, 98481 28215)