దోపిడీ విషయంలో బీజేపీ, తెరాస తోడు దొంగలు

  • సింగరేణి టెండర్లలో అవకతవకలపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టటం లేదు..
    పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
  • నేను చనిపోతే నామీద కాంగ్రెస్‌ ‌జెండానే ఉంటుంది : ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : సింగరేణి టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశామని, సెంట్రల్‌ ‌విజిలెన్స్ ‌కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, సిబిఐకి ఫిర్యాదు చేశామని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు లాభం చేకూరేలాగా టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌ప్రతిభా శ్రీనివాస్‌ ‌వ్యవహరించారని, వీరికి సీఎండీ శ్రీధర్‌ ‌సహకరించారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాను, కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు ప్రధాన మంత్రితో ముప్పై నిముషాలు మాట్లాడామని, కేంద్రం యాక్షన్‌ ‌తీసుకుంటామని తమకు భ్రమలు కల్పించిందని, తీరా చుస్తే ఏమి జరగలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఒకవైపు బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, ‌ధర్మపురి అరవింద్‌ ‌మంత్రి కిషన్‌ ‌రెడ్డి కేసీర్‌ ‌ది కుటుంబపాలన అని, కెసిఆర్‌ అవినీతికి పాలపడ్డారని, ఏ క్షణంలో అయినా కెసిఆర్‌ను జైలులో పెడతామని అంటారని..మరోవైపు ఆధారాలు సహా సింగరేణి టెండర్లకు సంబంధించి పిర్యాదు చేసినా కేంద్ర ప్రబుత్వం చర్యలు తీసుకోదన్నారు. నిజానికి తెరాస, బీజేపీ రెండూ మిలాఖత్‌ అయి వున్నాయని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. 49 శాతం వాటా వున్నా కేంద్ర ప్రభుత్వం అక్రమంగా కొనసాగుతున్న లావాదేవీలను ఎందుకు చూస్తూ వూరుకుంటున్నదని రేవంత్‌ ‌ప్రశ్నించారు.

కేంద్రానికి పిర్యాదు చేసినా లాభం లేదు కనుక కాంట్రాక్ట్ అమలులోకి వొచ్చిన మరుక్షణమే తెలంగాణ హై కోర్టుకి వెళతామని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. కోర్టుకి కూడా తెలుపుతామని, జరిగిన అక్రమంలో కెసిఆర్‌తో పాటుగా కేంద్రం పాత్ర ఉందని చెబుతామని రేవంత్‌ అన్నారు. సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు అయినా కెసిఆర్‌ ‌కూతురు కవిత సింగరేణి టెండర్ల విషయంలో మాట్లాడాలని ఆయన డిమాండ్‌ ‌చేసారు. బీజేపీ ప్రభుత్వం కెసిఆర్‌ ‌నుంచి ప్రొటెక్షన్‌ ‌మనీ అందుకుంటున్నదని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కెసిఆర్‌ ‌నుంచి నిధులు అందుతున్నాయి కనుకే కెసిఆర్‌ ఎన్ని అవకతవకలు చేస్తున్నా బీజేపీ చర్యలు తీసుకోవటం లేదని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ, కెసిఆర్‌ ‌రెండు ఒకటే కనుక కోర్టుకు పోయి సింగరేణి విషయంలో ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని చెబుతామని అన్నారు. రేవంత్‌ ‌రెడ్డితో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…గత మగళవారం తెలంగాణ అభివృద్ధి పనులకోసం ప్రధానిని కలిసానని చెప్పారు.

ప్రధానమంత్రి స్వయంగా తనతో కరప్షన్‌ ‌కేన్సర్‌ ‌కంటే ప్రమాదకారి అని, కరప్షన్‌ ‌వలెనే తెలంగాణ సర్వనాశనం అయిందని అన్నారని, అలాంటప్పుడు తాము ఇచ్చిన పిర్యాదు మీద ప్రధానై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్ధం కావటంలేదని కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. తాను పీఎంను కలిస్తే బీజేపీలో చేరేందుకు అని ప్రచారం జరిగిందని, తాను చనిపోతే తన మీద కాంగ్రెస్‌ ‌జెండానే ఉండాలి అనుకునే వాణ్ణి తనని, బీజేపీకి పోవటం సాధ్యం కాదని అన్నారు. రాజగోపాల్‌ అతని ఇష్టం మేరకు వున్నారని, తాను మాత్రం ప్రాణం పోయే వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ స్థాపనే తన ధ్యేయమని కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page