బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
తన పురోహితుని పంపి వారిని వచ్చి శాస్త్ర విధిగా వివాహమాడమన్నాడు. పాండవులు రాగానే ద్రుపదుడు వారి కుల గోత్రాలనడిగాడు. ధర్మరాజు అసలు విషయం చెప్పి రాజ మర్యాద ననుసరించి వివాహం జరిపించమన్నాడు. ద్రుపదుడు అయిదుగురూ వివాహమాడటం శాస్త్ర సమ్మతమా అనడిగాడు. ఆ సమయంలోనే వేద వ్యాసుడు విచ్చేసి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి ఆమె అయిదుగురికీ భార్య కావడం బ్రహ్మదేవుని నిర్ణయం అన్నాడు. ఆ తర్వాత ద్రుపదుడు.
ధర్మరాజుతో ముందుగా ద్రౌపది వివాహం జరిపించి, ఆ తర్వాత మిగిలిన నలుగురితో మా పెళ్ళి జరపించాడు. ఆడ బిడ్డకు ఆమెకిష్టమైన నగలూ, బట్టలూ పెట్టాడు. పురజనులకు వస్త్రదానాలు చేశాడు. ఈ విషయం దేశదేశాలకూ తెలిసింది.
ద్రౌపదిని వివాహం చేసుకున్నది పాండు రాజపుత్రులనే విషయం కూడా ఆనోటా ఈనోటా అంతటా పాకిపోయింది. ధృతరాష్టునికి తనవారే ద్రౌపదిని స్వయంవరంలో చేపట్టారని వినగానే దుర్యోధనుడు ద్రౌపదిని చేపట్టాడనుకున్నాడు.
అస్సలు విషయం తెలియగానే కొంచెం బాధపడ్డాడు. అయినా పైకి కనిపించనీయకుండా, పాండవులు జీవించి ఉండడం, ద్రౌపదిని వివాహమాడటం తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుందన్నాడు. ఉత్సవాలు జరుపమన్నాడు. ఈ విషయం విన్న దుర్యోదనాదులు దృతరాష్ట్రుని వద్దకు వచ్చి పాండవ పక్షపాతం వహిస్తున్నందుకు తమ ఆవేదన తెలియజేశారు. వారికి ఆయన అనునయ వాక్యాలు పలికి పంపించాడు. దుర్యోధనుడూ , శకునీ, కర్ణుడూ చెప్పిన మాటలను శ్రద్దగా విన్నాడు. ఆపైన పెద్దలను సంప్రదించగా భీష్ముడు పాండవులను రప్పించి వారి రాజ్యభాగాన్ని వారికివ్వమన్నాడు.ద్రోణాచార్యు